శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయని శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. అయితే అవకతవకలు భారీగా జరిగాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావటంతో సోదాల నిర్వహిస్తున్నారు. ఆలయ మాడ విధులతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, పుష్కరిణి తదితర పనులను మరో రెండు రోజుల పాటు పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు.

New Update
శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

Inspections by ACB officials in Srisailam

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గతంలో ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావటంతో తనిఖీలు చేశారు.అయితే ఈ ఫిర్యాదులను పరిశీలించి మరి అధికారులు తనిఖీలు చేపట్టిన్నారు. ఆలయ మాడ విధులు, ఔటర్ రింగ్ రోడ్డు, పుష్కరిణి తదితర పనులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. మరో రెండు రోజుల పాటు ఏసీబీ తనిఖీలు జరుగనున్నట్లు తెలిపారు.

బుధవారం ఏసీబీ ఆధ్వర్యంలో పలువు సభ్యులు దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన కొంతమందిని విచారించారు. అనినీతికి పాల్పడిన వారితోపాటు.. వారికి సహకరించినవారిని కూడా ప్రత్యేకంగా విచారించింది. ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరికొందరు అధికారుల పేర్లు కూడా ఈ సందర్భంలో చర్చకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాలను వారు పరిశీలించారు.

Advertisment
తాజా కథనాలు