Inner Wear Problems : రాత్రి సమయంలో లోదుస్తులు ధరిస్తున్నారా? కష్టాలు తప్పవు 

మనకి లోదుస్తులు ధరించడం అనేది తప్పనిసరి అవసరంగా చిన్నప్పటి నుంచి చెబుతారు. కానీ, నిత్యం లోదుస్తులు ధరించడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో లోదుస్తులు లేకుండా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. 

New Update
Inner Wear Problems : రాత్రి సమయంలో లోదుస్తులు ధరిస్తున్నారా? కష్టాలు తప్పవు 

Inner Wear Problems : ఉరుకులు.. పరుగులు జీవితం. కుర్చీలకు అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు కొందరివి.. అటూ ఇటూ అలుపెరగకుండా తిరుగుతూ గడిపే జీవితాలు మరికొందరివి. ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి అయ్యేసరికి ఎంతో అనీజీ. ఉదయాన్నే చక్కగా శుభ్రంగా తయారయి బయటకు వెళ్లాకా.. సాయంత్రం అయ్యేసరికి చికాకు చికాకు. ఇలా సాయంత్రానికి అనీజీగా ఉండడం.. చికాకుగా అనిపించడం.. ఎదో ఒక్క కారణం వలనే అవదు. చాలా కారణాలు దీని వెనుక ఉంటాయి. అయితే, వాటిలో చాలా మనకు తెలీదు. పనిలో ఒత్తిడి వలనో.. బయట పొల్యూషన్ చేతనో.. లేదా మరో కారణమో దీని వెనుక ఉందని అనుకుంటాం. కానీ, మన లోదుస్తులు ఇటువంటి చికాకుకు కారణంగా అవుతాయని మనం ఊహించలేం. అసలు ఆ దిశలో ఆలోచన కూడా రాదు. కానీ, ఇది నిజమని పరిశోధనలు చెబుతున్నాయి. మనకి లోదుస్తులు(Inner Wear Problems) వేసుకోవడం అనేది చిన్నతనం నుంచీ తప్పనిసరిగా అలవాటు చేసేస్తారు. అది ఒకరకంగా తప్పనిసరి చర్యలా మారిపోతుంది. కానీ.. లోదుస్తులు వేసుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే.. వాటిని ధరించకపోవడం వలన వచ్చే లాభమే ఎక్కువగా ఉంటుంది. పరిశోధకులు లోదుస్తులు వేసుకోకపోవడం వలన ఎటువంటి మంచి జరుగుతుందో పలు సందర్భాల్లో వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మహిళలు లోదుస్తులు వేసుకోవడం వలన సౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ, అది వారి ప్రయివేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ కు కారణంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే, ప్యాంటీ(Inner Wear Problems) వేసుకుని.. పైన మళ్ళీ డ్రస్ వేసుకుని… ఉదయం నుంచీ సాయంత్రం దాకా పని చేస్తూ ఉంటే.. ఆప్రాంతంలో తెలియకుండానే చెమట పడుతుంది. అది చాలా చికాకును తేవడమే కాదు.. తరువాత అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా కారణం అవుతుంది. వైద్యపరంగా చెప్పాలంటే, మీ యోని ప్రాంతం "ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్నప్పుడు చాలా సంతోషంగా - ఆరోగ్యంగా ఉంటుంది" అని పరిశోధకురాలు డాక్టర్ ఎలిజబెత్ ఈడెన్ చెప్పారు. 

అక్కడ ఇన్ఫెక్షన్ రావడాన్ని ఎవరూ ఇష్టపడరు - ఇది దురద, బలహీనపరిచే అలాగే  పూర్తిగా బాధించేది(Inner Wear Problems) కావచ్చు. మీరు లోదుస్తులు(Inners) ధరించడం మానేస్తే, మీరు మూత్ర నాళం లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందే అవకాశాలను తగ్గించవచ్చు.  ముఖ్యంగా యోని ఇన్ఫెక్షన్ల సాధారణ పోరాటాలతో బాధపడేవారికి లోదుస్తులు ధరించకపోవడమే హాయిగా ఉంటుంది.  డాక్టర్ నినిమై చెబుతున్నదాని ప్రకారం  ప్యాంటీలు తేమతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇవి అదనపు తేమ - సూక్ష్మజీవులను ట్రాప్ చేసే అవకాశం ఎక్కువ" ఇక్కడ ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే ఫంగస్ అయిన కాండిడా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా జిమ్‌(Gym) లో ఉన్నప్పుడు ఇది జరగవచ్చు, ప్రత్యేకించి మీరు ఊపిరి పీల్చుకోలేని ప్యాంటీలను ధరించినట్లయితే అని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇంటర్నేషనల్ వెబ్సైట్ ది లిస్ట్ కి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. 

రాత్రి సమయంలో లోదుస్తులు వదిలేయండి..
లోదుస్తులు ధరించడం వల్ల  యోని ప్రాంతంలో(Inner Wear Problems) ఇబ్బందులు ఎదుర్కునే స్త్రీలు లో దుస్తులు లేకుండా పడుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అసలు రాత్రి సమయంలో ఎవరైనా కానీ, లోదుస్తులు లేకుండా చూసుకోవడం అవసరమే అని కూడా వారంటున్నారు. డాక్టర్ నాన్సీ చెబుతున్న దాని ప్రకారం కనీసం రాత్రి సమయంలో అయినా ఆ ప్రాంతంలో గాలి పోయేలా చేయడం వలన మీ యోని ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడ బాక్తీరియా వృద్ధి చెందే అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల రోజంతా అందమైన ప్యాంటీస్ వేసుకుని తిరిగినా మీ యోని సంతోషంగా ఉండడం కోసం రాత్రి సమయంలో లోదుస్తులను ధరించడం మానేయాలని ఆమె సూచిస్తున్నారు. 

Also Read: పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసుకోవడం ఎలా?

యోని ఇన్ఫెక్షన్లకు(Inner Wear Problems) గురయ్యే స్త్రీలకు ఈ రాత్రిపూట ఆచారం ప్రత్యేకంగా సహాయపడుతుంది. "మీరు యోని సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే మీరు నిజంగా లోదుస్తులు లేకుండా నిద్రపోవాలి" అని OB-GYN అయిన డాక్టర్ నాన్సీ హెర్టా గ్లామర్‌తో చెప్పారు . లోదుస్తులు తేమను బంధించగలవు మరియు ఆ రకమైన తడి వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా బాక్టీరియల్ వాగినోసిస్‌కు కారణమవుతుంది. "ఆ ప్రాంతాన్ని కొంత గాలిని పొందడానికి అనుమతించడం వలన దానిని పొడిగా మరియు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది" అని హెర్టా చెప్పారు. కాబట్టి మీరు రోజంతా అందమైన లేస్ అండీలను ధరించినట్లయితే, యోని సంతోషంగా ఉండటానికి రాత్రిపూట లోదుస్తులను ధరించడం మానేయడం మంచిది.

వ్యాయామ సమయాల్లో..
సాధారణంగా వ్యాయామ సమయంలో లోదుస్తులు(Inner Wear Problems) తప్పనిసరి. లేదంటే, ఇబ్బంది ఎదురవుతుందని అనుకుంటాం. కానీ.. లోదుస్తులు ధరించి వ్యాయాయం చేయడం సురక్షితం అయినప్పటికీ..  మీ ప్రైవేట్ భాగాల నుండి వేగంగా దుర్వాసన రావడాన్ని మీరు గమనించవచ్చు. "చెమట వలన జననేంద్రియ ప్రాంతంతో సహా వెంట్రుకలు మోసే ప్రదేశాలలో చర్మ బ్యాక్టీరియా శరీర దుర్వాసనను కలిగిస్తుంది" అని డాక్టర్ అలిస్సా డ్వెక్ - ది లిస్ట్ కి  చెప్పారు . మీరు ప్యాంటీ లేకుండా ఉన్నట్లయితే, మీకు - మీ వర్కౌట్ షార్ట్‌లు లేదా లెగ్గింగ్‌లకు మధ్య ఎటువంటి అవరోధం ఉండదు.  కాబట్టి, చెమట మీ లోదుస్తులకు తగలకుండా, అది నేరుగా మీ ప్యాంట్‌కి వెళుతుంది.  తద్వారా మీకు చెమట వలన వచ్చే ఇబ్బంది తగ్గిపోతుంది. 

మీరు పని చేస్తున్నప్పుడు ప్రతిరోజూ లోదుస్తులు(Inner Wear Problems) ధరించడం మానేస్తే, మీరు మైక్రో-కట్‌ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  దీనిని యోని పగుళ్లు అని కూడా పిలుస్తారు. ఇది చెప్పలేని బాధను కలిగిస్తుంది. అందువల్ల మీరు రోజూ వ్యాయమ సమయంలో.. సాధారణ పనిసమయంలో మృదువుగా ఉండే గాలి పోసుకోవడానికి అనుకూలంగా  ఉండే ప్యాంటు ధరించడం మంచిది అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. 

మొత్తంగా చూసుకుంటే.. ఈ విషయాలన్నీ మనకు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చేవే. కానీ, వాటిని మనం పెద్దగా పటించుకోవడం జరగదు. లేదా సంప్రదాయంగా ప్యాంటీ వేసుకోవడం అలవాటు అయిపోయి.. అది లేకుండా ఉండలేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా అలానే గడిపేస్తాం. కానీ, అది మంచిది కాదు. కనీసం ఇంటి వద్ద ఉన్న సమయంలో, రాత్రి సమయంలో లోదుస్తులు లేకుండా నిదురించడం ద్వారా యోని వద్ద వచ్చే ఇన్ఫెక్షన్స్(Infections) విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి యోని ఇన్ఫెక్షన్ క్రమేపీ యోని, పాయువు ద్వారా లోపలి భాగాల్లోకి చేరిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లోదుస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ లో వైద్యులు, పరిశోధకులు వెలువరించిన అభిప్రాయాల ఆధారంగా.. మీ ప్రాథమిక అవగాహన కోసం ఇచ్చినది. ఇన్నర్ వేర్ విషయంలో మీకు తలెత్తే ఇబ్బందులకు సంబంధించి మీ వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలని సూచిస్తున్నాం.

Also Read : Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్‌

Watch this Interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు