Man Thrashes Mother: కరెంట్‌ పోల్‌కి కట్టేసి తల్లిని కొట్టిన కొడుకు.. ఇంత దారుణమా?

ఒడిశా కియోంజర్ జిల్లాలోని సరస్పసి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్‌ను చోరీ చేసిందన్న అనుమానంతో ఓ తల్లి(70)ని ఆమె కుమారుడు కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను శతృఘ్న బెదిరించాడు.

Man Thrashes Mother: కరెంట్‌ పోల్‌కి కట్టేసి తల్లిని కొట్టిన కొడుకు.. ఇంత దారుణమా?
New Update

చిన్నతనంలో తల్లి తనువునంతా దోచుకున్న ఆ తనయుడికి పెద్దయ్యాక మాత్రం అదే తల్లి దొంగలా కనిపించింది. తన పెరట్లోని ఓ క్యాలిఫ్లవర్‌ని ఎవరో దొంగతనం చేస్తే.. ఆ చోరీ తన తల్లే చేసిందంటూ ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆమె వయసు 70.. వృద్ధురాలు అని కూడా లేకుండా ఎలా పడితే అలా కొట్టాడు. చివరకు తన ఇంటి బయటున్న కరెంట్‌ పోల్‌కి కట్టేశాడు. ఎంత ఏడ్చినా కనీకరించలేదు. చుట్టూ పక్కన వాళ్లు కూడా ఆమెను విడిపించే సాహసం చేయలేకపోయారు. కానీ ఎవరో ఫొటో మాత్రం తీశారు. సోషల్‌మీడియాలో ఆ ఫొటోను పెట్టారు. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. ఆ కొడుకుపై కేసు నమోదైంది. ఒడిశాలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

క్యాలిఫ్లవర్ చోరీ చేసిందని హింస:

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్‌ను తెంపిందన్న అనుమానంతో ఓ తల్లిని ఆమె కుమారుడు కొట్టి విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఆమె పేరు సుభద్ర మహంత్. సుభద్ర చిన్న కొడుకు శతృఘ్న భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆమె భర్త పదేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి పెద్ద కొడుకు దగ్గర ఉంటోంది సుభద్ర. అయితే ఈ మధ్య పెద్ద కొడుకు కూడా మరణించాడు. దీంతో చిన్న కొడుకు శతృఘ్న వద్దకు ఆమె అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన ఆమెను శతృఘ్న అనుమానించాడు.. క్యాలీఫ్లవర్‌ను చోరీ చేశావంటూ తిట్టి, కొట్టి.. పోల్‌కు కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులకు శతృఘ్న నుంచి బెదిరింపులు వచ్చాయి. అయితే పోల్‌కు కట్టేసిన తర్వాత కొడుకు ఇంట్లో లేని సమయం చూసి స్థానికులు ఆ తల్లిని రక్షించారు. చికిత్స నిమిత్తం బాసుదేవ్‌పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఇది దొంగతనం ఎలా అవుతుంది?

ఈ ఘటనపై పోలీసులు ఆ తల్లిని ప్రశ్నించారు. శతృఘ్నపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఐఐసీ త్రినాథ్ సేథీ తెలిపారు. ఇక తన కోడలు కూడా ఏమీ చేయాలని పరిస్థితిలో ఉందని.. ఎందుకంటే తన కొడుకు ఆమెను ఇలానే కొడుతుంటాడని పోలీసుల వద్ద వాపోయింది సుభద్ర. అటు బాసుదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి చెందిన డాక్టర్ అభిజిత్ దీక్షిత్ మాట్లాడుతూ, 'మహిళను డిసెంబర్ 20న ఇక్కడ చేర్చారు.. ఆమె ఇంకా నొప్పిని అనుభవిస్తూనే చికిత్స పొందుతోంది.'అని చెప్పారు. మరోవైపు గ్రామస్తులు సైతం శతృఘ్నపై మండిపడుతున్నారు. అసలు అతను కొడుకే కాదని.. తల్లి కష్టాల్లో ఉంటే పట్టించుకోడని ఫైర్ అవుతున్నారు. కొడుకు ఇంట్లో క్యాలిఫ్లవర్‌ తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

WATCH:

#odisha #crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe