Infosys: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఇన్ఫోసిస్‌!

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన కంపెనీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అతి త్వరలోనే ఉద్యోగులకు శాలరీలు హైక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన జీతాలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.

Lay Offs : 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి... 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌!
New Update

కరోనా (Corona) తరువాత ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు (IT Companies) అన్ని కూడా తమ ఉద్యోగులకు లే ఆఫ్‌ (Layoff) లు ఇస్తున్న తరుణంలో ఐటీ దిగ్గజం అయినటువంటి ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. అది ఏంటంటే..జీతాల పెంపు ను గత ఐదు నెలలుగా వాయిదా వేస్తూ వచ్చిన కంపెనీ ఇప్పుడు ఓ క్లారిటీ ఇచ్చింది.

అతి త్వరలోనే శాలరీలను హైక్‌ (Salary Hike)  చేస్తున్నట్లు తెలిపింది. పెరిగిన జీతాలు నవంబర్‌ 1 నుంచి అమలు అవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఇక్కడ కంపెనీ ఓ కండిషన్ పెట్టింది...అది ఏంటంటే... ఈ శాలరీల పెంపు అనేది అందరు ఉద్యోగులకు వర్తించిదని తెలిపింది. 2021 అక్టోబర్‌ తరువాత కంపెనీలో జూనియర్‌ స్థాయిలో చేరిన ఉద్యోగులు , అదే విధంగా 2021 అక్టోబర్‌ తరువాత చేరిన మేనేజర్‌ స్థాయి వారికి కూడా ఈ హైక్‌ ఉండదని వివరించింది.

అయితే దీని గురించి ఇంకా కంపెనీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉండగా..ఈ పెంపు 7 శాతం నుంచి 10 శాతం మధ్యలో ఉంటుందని సమాచారం. సాధారణంగా ఐటీ కంపెనీలు అన్ని కూడా వారి ఉద్యోగులకు జులై నెలలో హైక్‌లు ఇస్తుంటాయి.

కానీ ఈ ఏడాది అన్ని కంపెనీలు శాలరీల హైక్‌ విషయాన్ని పక్కకు పెట్టాయి. ఇదిలా ఉంటే మరో ప్రముఖ టెక్‌ కంపెనీ విప్రో తమ ఉద్యోగుల జీతాల్ని పెంచుతుండగా..అందులో కూడా ఎక్కువ పే తీసుకుంటున్న వారికి కాకుండా వర్క్‌ విషయంలో పరెఫెక్ట్‌ గా ఉండి..తక్కువ శాలరీలు తీసుకుంటున్న వారికి జీతాలు పెంచుతున్నట్లు సమాచారం.

అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ కూడా ఈ ఏడాది భారత్‌, శ్రీలంకల్లోని తమ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు ఉండదని కేవలం ముఖ్యమైన విభాగాల్లో పని చేసే వారికి మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

Also read: ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది: బొత్స!

#it-companys #salaries #infosys #hike
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe