Inesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ద్వీపసమూహంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకదాని నుండి ఆకస్మిక వరదలు – చల్లని లావా ప్రవాహం కారణంగా పశ్చిమ ఇండోనేషియాలో కనీసం 34 మంది మరణించారు. 16 మంది తప్పిపోయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని అగామ్, తనహ్ దాతర్ జిల్లాలలో గంటల తరబడి కురిసిన భారీ వర్షం వరదలకు కారణమైంది. కురుస్తున్న వర్షాల కారణంగా మరాపి పర్వతం నుండి బూడిద, పెద్ద రాళ్లు కొట్టుకుని రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పూర్తిగా చదవండి..Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 34 మంది మృతి
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని అగామ్, తనహ్ దాతర్ జిల్లాలలో ఒక్కసారిగా వచ్చిపడిన వరదలతో 34 మంది మరణించగా, 16 మంది కనిపించకుండా పోయినట్టు అక్కడి అధికారులు చెప్పారు.
Translate this News: