/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indigo-offers-jpg.webp)
దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఊరూవాడా గణేశ్ నవరాత్రుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గణేశ్ నవరాత్రుల తర్వాత దేవీ నవరాత్రుల ఉత్సవాలు, దసరా, దీపావళి వేడుకలు వరుసగా రానున్నాయి. అయితే.. పండుగ అనగానే అందరికీ గుర్తు వచ్చేది సొంత ఊరు. కుటుంబ సభ్యులతో సొంత ప్రాంతంలో బంధు మిత్రులతో కలిసి పండుగ చేసుకుంటే ఆ సంతోషమే వేరు.. ఈ కారణంగానే పండుగ వచ్చిందంటే చాలు బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుంటాయి. నెలల ముందుగానే టికెట్లు అన్నీ బుక్ అయిపోతాయి. ఆ సమయంలో టికెట్లకు అదనపు ధర కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ (indigo) ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ పై అదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా 15 శాతం భారీ డిస్కౌంట్ తో ఈ పండుగ సీజన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఇండిగో ఎయిర్ లైన్స్. హోమ్‌కమింగ్ సేల్ పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది ఇండిగో ఎయిర్ లైన్స్. దీని కింద, ఈ పండుగ సీజన్‌లో ప్రయాణీకులు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 15 శాతం వరకు డిస్కౌంట్ అందుకుంటారు. ఈ ఆఫర్‌ను పొందడానికి, మీరు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టిక్కెట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ ఆఫర్ ను ఈ నెల 18న ప్రారంభించగా.. 21వ తేదీ లాస్డ్ డేట్. గడువు ముగిసేలోగా ప్రయాణికులు సెప్టెంబర్ 25, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు తాము చేసే ప్రయాణాలకు సంబంధించి టికెట్లను 15 శాతం డిస్కౌంట్ తో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అయితే.. రౌండ్ ట్రిప్ బుకింగ్స్ పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది.
The #HomecomingSale is live.
Save up to 15% on website and app bookings using code ‘6EHOME’. Hurry, book before 21st September, 2023. Offer valid only on round-trip bookings. T&C apply. https://t.co/7cXS00j0Yq #goIndiGo #IndiaByIndiGo #Sale pic.twitter.com/Kef9GZkuMs— IndiGo (@IndiGo6E) September 18, 2023
ఇలా బుక్ చేసుకోండి:
ఇండిగో యొక్క ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాల బేస్ ధరపై అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులకు బేస్ ఫేర్‌పై 15 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, టికెట్లను బుక్ చేసే సమయంలో 6EHOME కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఆఫర్ ఏ ఇతర ఆఫర్ లేదా స్కీమ్‌తో కలిపి ఉపయోగించే అవకాశం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.