Asian Games: ఈక్వెస్ట్రియన్‌ పోటీల్లో భారత్‌ రికార్డు.. 41ఏళ్ల తర్వాత స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్‌ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

New Update
Asian Games: ఈక్వెస్ట్రియన్‌ పోటీల్లో భారత్‌ రికార్డు.. 41ఏళ్ల తర్వాత స్వర్ణం

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టు (Equestrian) అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్‌ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆతిథ్య చైనాను వెనక్కి నెట్టింది. హృదయ్‌ చెడ్డా (Hriday Chheda), దివ్యకృతి సింగ్‌ (Divyakriti Singh), అనుష అగర్వాల(Anush Agarwalla), సుదీప్తి హజేలా(Sudipti Hajela)తో కూడిన జట్టు 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (204.882 పాయింట్లు), హాంకాంగ్‌ (204.852 పాయింట్లు)ను రజతం, కాంస్యానికి పరిమితం చేసింది. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌కు ఇది నాలుగో బంగారు పతకం. అంతకు ముందు మూడు స్వర్ణ పతకాలను 1982 ఆసియా క్రీడల్లో గెలుచుకుంది.

సెయిలింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకోగా.. పురుషుల విభాగంలో మరో రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఎబాద్‌ అలీ ఆర్‌ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకాలు అందుకున్నారు.

క్రికెట్‌ విభాగంలోనూ భారత్ జట్టుకు తిరుగులేదని చూపించారు మన అమ్మాయిలు. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన హర్మన్ సేన త్రివర్ణ పతాకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి మరీ రైఫిల్ టీమ్ బంగారు పతకాన్ని సాధించారు. రుద్రాంక్ష్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ సింగ్ సన్వర్ కలిసి 1893.7 స్కోరు చేసి టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది చైనా నెలకొల్పిన వరల్డ్ రికార్డును భారత షూటర్లు తిరగరాశారు. ఇక వ్యక్తిగత విభాగంలో కూడా ప్రతాప్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ విభాగంలో కూడా భారత్‌ కాంస్య పతకం దక్కింది. అనీశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, ఆదర్శ సింగ్ త్రయం క్వాలిఫికేషన్లో 1718 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కూడా చైనాకు స్వర్ణం, దక్షిణ కొరియాకు రజతం వచ్చాయి.

ఇక భారత రోయర్లు మొత్తం అయిదు పతకాలు సాధించారు. మొదటి రోజు రెండు రజతాలు, కాంస్యం నెగ్గిన రోయర్లు.. రెండో రోజు మరో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. భారత్ రోయర్లు 2018 కంటే ఈ సారి ఎక్కువ పతకాలను గెలుచుకున్నారు. కానీ బంగారాన్ని మాత్రం సాధించలేకపోయారు.

ఇది కూడా చదవండి: హమ్మయ్య మొత్తానికి వీసా వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు