Manu Bhaker: మను బాకర్‌కు త్రుటిలో చేజారిన మూడో పతకం

మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం చేజారింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్‌ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్‌‌
New Update

Manu Bhaker: మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం చేజారింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్‌ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్ప‌టికే మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ల‌లో మను బాకర్‌ కాంస్య ప‌త‌కాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఈరోజు జ‌రిగిన 25 మీట‌ర్ల పిస్టల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో.. మను బాకర్‌ ప‌త‌కం కోసం తీవ్ర ప్ర‌య‌త్నం చేసింది. మను , హంగేరియ‌న్ షూట‌ర్ మ‌ధ్య ఎలిమినేష‌న్ రౌండ్ జ‌రిగింది. కాగా మూడో పతాకం కోసం ఎంతగానో ట్రై చేసిన మనుకు నిరాశే మిగిలింది.

హ్యాట్రిక్‌తో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని ఆమె తృటిలో కోల్పోయింది. 5 షాట్ టార్గెట్‌లో ఆమె కేవ‌లం మూడింటిని షూట్ చేయడంతో ఆమె ఈ రికార్డును పొందలేక పోయింది. అయితే ఎలిమినేష‌న్ రౌండ్‌లో హంగేరికి చెందిన షూట‌ర్ వెరోనికా మేజ‌ర్ 4 హిట్స్ కొట్టింది. 33 పాయింట్ల‌తో కొరియా క్రీడాకారిణి జిన్ యాంగ్ తొలి స్థానంలో ఉండ‌గా, ఫ్రాన్స్ షూట‌ర్ కామిల్లీ జెడ్‌జివిస్కీ రెండ‌వ స్థానంలో, వెరోనికా మూడ‌వ స్థానంలో నిలిచారు. నాలుగు స్థానంలో మను బాకర్‌ నిలిచింది.

#manu-bhaker
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe