Manu Bhaker: మను బాకర్‌కు త్రుటిలో చేజారిన మూడో పతకం మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం చేజారింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 03 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Manu Bhaker: మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం చేజారింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్ రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. Paris Olympics 2024 | India's Manu Bhaker finishes fourth in 25m pistol women's final. #OlympicGames — ANI (@ANI) August 3, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో మను బాకర్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్‌లో.. మను బాకర్ పతకం కోసం తీవ్ర ప్రయత్నం చేసింది. మను , హంగేరియన్ షూటర్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. కాగా మూడో పతాకం కోసం ఎంతగానో ట్రై చేసిన మనుకు నిరాశే మిగిలింది. హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆమె తృటిలో కోల్పోయింది. 5 షాట్ టార్గెట్‌లో ఆమె కేవలం మూడింటిని షూట్ చేయడంతో ఆమె ఈ రికార్డును పొందలేక పోయింది. అయితే ఎలిమినేషన్ రౌండ్‌లో హంగేరికి చెందిన షూటర్ వెరోనికా మేజర్ 4 హిట్స్ కొట్టింది. 33 పాయింట్లతో కొరియా క్రీడాకారిణి జిన్ యాంగ్ తొలి స్థానంలో ఉండగా, ఫ్రాన్స్ షూటర్ కామిల్లీ జెడ్‌జివిస్కీ రెండవ స్థానంలో, వెరోనికా మూడవ స్థానంలో నిలిచారు. నాలుగు స్థానంలో మను బాకర్ నిలిచింది. #manu-bhaker మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి