Morarji Desai: ఇందిరాకు ఎదురెళ్లిన ప్రధాని.. మొరార్జీ దేశాయ్‌ వర్థంతి నేడు

భారతదేశంతో పాటు పాకిస్తాన్ అత్యున్నత పౌర గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత ఆయన. ఆయనే మొరార్జీ దేశాయ్! నేడు ఏప్రిల్ 10 ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కీర్తిని మరోసారి గుర్తుచేసుకుందాము.

New Update
Morarji Desai: ఇందిరాకు ఎదురెళ్లిన ప్రధాని.. మొరార్జీ దేశాయ్‌ వర్థంతి నేడు

Morarji Desai: భారతదేశంతో పాటు పాకిస్తాన్ అత్యున్నత పౌర గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత ఆయన. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టిన ఆయన తర్వాత ఆమెతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఏప్రిల్ 10 ఆయన వర్థంతి.. ఆయనే మొరార్జీ దేశాయ్!

publive-image
పాక్‌ దేశ అత్యున్నత పౌర పురస్కారం పేరు నిషాన్-ఎ-పాకిస్తాన్‌. ఈ అవార్డును అందుకున్న ఏకైక భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు పాకిస్థాన్ ఆయనకు ఈ గౌరవాన్ని ఇచ్చింది. భారత్‌తో పాటు పాకిస్తాన్ అత్యున్నత పౌర గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఆయనకు కేంద్రం భారత రత్న అవార్డు కూడా ఇచ్చింది.

publive-image
మొరార్జీ దేశాయ్ ఫిబ్రవరి 29,1896న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారంటారు మోరార్జీ. తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్‌ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండడాన్ని ఆయన నమ్మేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి సాటిలేనిది. సాంప్రదాయ మత కుటుంబం నుంచి వచ్చిన మొరార్జీ దేశాయ్ ప్రతి మనిషి తన జీవితంలో సత్యానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేవారు. బ్రిటీష్ హయాంలో సుమారు 12 ఏళ్లపాటు డిప్యూటీ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. తర్వాత మహాత్మా గాంధీ స్ఫూర్తితో 1930లో స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. 1931లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్‌లో ఉప ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

publive-image

1969లో ఇందిరా గాంధీ నిర్ణయంపై కోపంతో కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిజానికి అప్పట్లో ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రి పదవిని ఆయన నుంచి లాక్కొని 14 బ్యాంకులను జాతీయం చేశారు. దీంతో విస్తుపోయిన ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్‌ని స్థాపించారు. ఎమర్జెన్సీ లాంటి ఇందిరా గాంధీ నిర్ణయాలను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు, మొరార్జీ దేశాయ్ వారి నుంచి ఏర్పడిన జనతా పార్టీకి నాయకత్వం వహించారు. 1977 ఎన్నికలలో, జనతా పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొరార్జీ దేశాయ్‌ను ప్రధానమంత్రిని చేశారు.

publive-image

ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, పాకిస్తాన్‌తో భారతదేశ సంబంధాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఉద్ధృతి కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొరార్జీ దేశాయ్ పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకోసం మొరార్జీ దేశాయ్, పాకిస్థాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో లావాదేవీలు కొనసాగించాలని మొరార్జీ దేశాయ్ జియా ఉల్ హక్‌తో అన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తే మన మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని. మనం ఒకరినొకరు అన్నదమ్ముల్లా చూసుకోవాలన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి పదవీ విరమణ చేసిన తరువాత, పాకిస్తాన్ ఆయన్ను మే 19, 1990న నిషాన్-ఎ-పాకిస్తాన్ అవార్డుతో సత్కరించింది.

Advertisment
తాజా కథనాలు