Chandrayaan-3: దటీజ్‌ ఇస్రో... చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. జాబిల్లిపై రహస్యాలను ఛేదించడానికి చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత... చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రయోగాన్ని టీవీల్లో చూస్తు ల్యాండింగ్‌ సక్సెస్‌ అవ్వాలని ఊపిరి బిగబట్టిన భారతావని ఆనందంతో కేరింతలు కొడుతోంది.

New Update
Chandrayaan-3: దటీజ్‌ ఇస్రో... చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సూపర్‌ సక్సెస్

Chandrayaan-3 lands on moon surface: దేశమంతా సంబురాలు మొదలయ్యాయి.. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది.. పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లల మారి కేరింతలు కొడుతున్నారు.. చంద్రయాన్‌-3 ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.. ల్యాండర్‌ జాబిల్లిపై కాలు మోపింది.. రోవర్‌ వడివడిగా అడుగులేసుకుంటూ చంద్రుడి నేలను తాకింది.. కోట్ల మంది కళ్లలో వెలుగులు.. కాలర్‌ ఎగరేసుకునే గర్వం.. ఇదేరా ఇండియా అని చెప్పుకునే ఆనందం.. మొత్తానికి దటీజ్‌ ఇస్రో అని ప్రపంచమంతా అనుకునేలా చేశారు సైంటిస్టులు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలమిది.

చంద్రయాన్‌-2 ఓటమితో కుంగిపోలేదు.. బాధపడ్డారు.. ఆ బాధలో నుంచే కసి పుట్టింది. చంద్రయాన్‌-3కి ఇస్రో సైంటిస్టులు శ్రీకారం చుట్టారు.. ప్రాణంపెట్టి పనిచేశారు.. ఓటమి రుచి చవి చూడని వారికి గెలుపు రుచి తెలియదంటారు కదా.. ఇస్రో శాస్త్రవేత్తల ఆనందం చూస్తే ఇప్పుడా విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అంతా చిన్నపిల్లల మారిపోయారు.. ఈ రోజు కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటున్న వారి కంటి నుంచి కన్నీళ్లు తన్నుకొచ్చాయి..ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు.. చంద్రయాన్-2 సమయంలో చివరిమెట్టుపై బోల్తా పడినప్పుడు వచ్చిన కన్నీళ్లు కావు ఇవి.. ఇది ఇస్రో సైంటిస్టుల గెలుపు.. వారి కష్టానికి దక్కిన గౌరవం. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశం మనదేనని 140 కోట్ల ప్రజలు సగర్వంగా చెప్పుకుంటారంటే అది కేవలం ఇస్రో సాధించిన విజయం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మానవ నిర్మిత ప్రోబ్‌ కూడా మనదే!

దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కూడా ఇస్రోదే. దేశ ప్రధాని నుంచి సాధారణ పౌరుల వరకు.. విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించారు. టీవీలకు అతుక్కుపోయారు. దేశం అంతా ఏకమయ్యే క్రికెట్ మ్యాచ్‌ని మించి ఓ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రతిఒక్కరూ తమ షెడ్యూల్‌లను మార్చుకున్నారంటే ఇస్రో గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. కుల, మత బేధాలు మరిచి అందరూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోడ్లపైకి స్వీట్లు పంచుకుంటున్నారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా దేశమంతా ఏకం కావడం.. ఆనందంలో మునిగిపోవడం చూసి ఏళ్లు దాటిపోయాయి.. ఇదంతా ఇస్రో వల్లే సాధ్యమైంది.. దటీజ్ ఇస్రో..జయహో ఇండియా!

Advertisment
తాజా కథనాలు