Ayodhya Rammandhir: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు..

అయోధ్యలో మరికొన్ని రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. అమెరికాలోని 21 నగరాల్లో రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో అక్కడి ప్రాంతాలు మారుమోగిపోయాయి. శనివారం రాత్రి టెస్లా కార్ల యజమానులు తమ కార్లతో మ్యూజిక్ షో నిర్వహించారు.

Ayodhya Rammandhir: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు..
New Update

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఈ వేడుకను చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం అమెరికాకు కూడా చేరిపోయింది. ఇప్పటికే న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌లో రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని 21 నగరాల్లో జై శ్రీరాం నినాదాలతో రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు.

Also read: వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్

అట్లాంటా, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, హుస్టన్‌, కాలిఫోర్నియా, బోస్టన్ తదితర నగరాల్లో 'విశ్వ హిందూ పరిషత్ అమెరికా' ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఘనంగా ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్‌లోని మేరిల్యాండ్‌లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం రాత్రి దాదాపు 150 మంది టెస్లా కార్ల యజమానులు టెస్లా మ్యూజిక్ షోను నిర్వహించారు. ఇంగ్లీష్‌లో రామ్ (RAM) అని వచ్చేలా కార్లను నిలిపి వాటి హెడ్‌లైట్లు వేశారు.

Also Read: రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రియాంక గాంధీ పోటీ?

అలాగే ఆ కార్ల మ్యూజిక్‌ సిస్టంల నుంచి శ్రీరాముని పాటలు హోరెత్తాయి. సంగీతానికి అనుగుణంగా లైట్ల మెరుపులు చూపరులను మంత్రముగ్తుల్ని చేసాయి. యూపీలో అయోధ్యలో రామమందిరం కోసం 500 ఏళ్లుగా పోరాడిన హిందూ తరాలకు తాము కృతజ్ఞతలు చెబుతున్నామని.. వీహెచ్‌పీ అమెరికా డీసీ ఛాప్టర్‌ అధ్యక్షుడు మహేంద్ర సపా అన్నారు. మరో విషయం ఏంటంటే శ్రీరామ సందేశంతో పది రాష్ట్రాల్లో హోర్టింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

#ayodya-ram-temple #usa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe