IPL2024: 100 మ్యాచ్ ల క్లబ్ లో శుభ్ మన్ గిల్! By Durga Rao 25 Apr 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 100 మ్యాచ్ ల క్లబ్ లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించాడు. భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 100 మ్యాచ్ ల క్లబ్ లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 24 సంవత్సరాల వయసులోనే 100 ఐపీఎల్ మ్యాచ్ ల రికార్డు సాధించాడు. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ బరిలో నిలవడం ద్వారా శుభ్ మన్ వంద మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు. ఆరేళ్ల క్రితం అండర్ -19 ప్రపంచకప్ లో సత్తా చాటుకోడం ద్వారా కోల్ కతా ఫ్రాంచైజీలో చోటు సంపాదించిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. 2018 నుంచి 2021 సీజన్ వరకూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడిగానే తన ప్రస్థానం కొనసాగించాడు. తన తొలిసీజన్లోనే గిల్ 13 మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కించుకొన్నాడు. 2021 సీజన్లో గిల్ అత్యుత్తమంగా రాణించాడు. కోల్ కతా తరపున 17 మ్యాచ్ లు ఆడి 478 పరుగులతో 28.11 సగటు, 118.90 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు. 57 అత్యధిక వ్యక్తిగత స్కోరుతో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 2018 నుంచి 2021 వరకూ కోల్ కతా 58 మ్యాచ్ లు ఆడిన గిల్ 1417 పరుగులు సాధించాడు. 31.49 సగటుతో పాటు 123.00 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు. 76 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో సహా మొత్తం 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2021 సీజన్ ఎలిమినేటర్ రౌండ్లో గిల్ అత్యుత్తమంగా రాణించాడు. బెంగళూరుతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్ లో 18 బంతుల్లో 29 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో 46, ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన 51 పరుగుల స్కోర్లు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తో టాప్.. 2022 సీజన్లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి మారటంతో శుభ్ మన్ గిల్ దశ తిరిగింది. తన కెరియర్ ప్రారంభంలోనే వరుసగా రెండు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన శుభ్ మన్ ప్రతిభ కారణంగానే హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ సాధించగలిగింది. 2022 సీజన్లో ఐపీఎల్ విజేతగా నిలిచిన టైటాన్స్ ..2023 సీజన్లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేపట్టిన గిల్ కెప్టెన్ గా మిశ్రమఫలితాలను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఢిల్లీ ప్రత్యర్థిగా జరిగిన తన వందోమ్యాచ్ లో గిల్ కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. ఇప్పటి వరకూ ఆడిన 100 మ్యాచ్ ల్లో గిల్ మొత్తం 3,094 పరుగులు సాధించాడు. 38.12 సగటుతో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. 129 స్ట్ర్రయిక్ రేటుతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన మొదటి 25 మంది బ్యాటర్లలో చోటు సంపాదించాడు. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ ప్రత్యర్థిగా ఆడిన తొలి అంచెమ్యాచ్ లో కేవలం 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్..రెండో అంచెపోరులోనూ రాణించలేకపోయింది. ప్రత్యర్థి ఢిల్లీకి గుజరాత్ బౌలర్లు 224 పరుగులు సమర్పించుకొని తమజట్టు ఓటమికి కారకులయ్యారు. తన కెరియర్ లో 100వ ఐపీఎల్ మ్యాచ్ శుభ్ మన్ గిల్ కు కెప్టెన్ గా మాత్రమే కాదు..ఓపెనర్ గానూ చేదుఅనుభవాన్నే మిగిల్చింది. #ipl #shubman-gill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి