Lays Offs in Top It Companies: దేశంలోని ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య రోజురోజుకి తగ్గుతుండడంతో ఉన్న ఉద్యోగులతో పాటు, కొత్తగా జాయిన్ అవుతున్న వారిని కూడా కలవరపెడుతుంది. ముఖ్యంగా టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ (HCL) కంపెనీల్లోనే ఉద్యోగులు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే..ఈ జులై-సెప్టెంబర్ నెలలో మాత్రమే..సుమారు 16 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు వదులుకొని వెళ్లిపోయారు. దీనికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు. ఇలా ప్రముఖ కంపెనీల నుంచి ఐటీ ఉద్యోగులు ఇలా తరలి వెళ్లిపోతుండడంతో కొత్తగా ఐటీ ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ (Freshers) ని కవలవరపెడుతుంది.
Also read: నేడే ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
మూడు ప్రముఖ కంపెనీలు కూడా రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 16,162 మేర తగ్గింది. ఐటీ కంపెనీల్లో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం కనిపించదు. టీసీఎస్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా ఆరున్నర వేల మంది తగ్గిపోయారు. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు ఎప్పుడూ కూడా తగ్గలేదు.
ఇన్ఫోసిస్ లో కూడా ఏడున్నర వేల మంది తగ్గిపోగా..హెచ్‌సీఎల్ టెక్లో 2,299 మంది చొప్పున తగ్గారు. దీనిని చూసుకుంటే ఇతర ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగులు తగ్గుతారా లేదా...అనేది చూడాల్సిందే. కొన్ని కంపెనీల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటుంది. కొన్ని కంపెనీలు అయితే వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించుకోవడం లేదు.
దీంతో కంపెనీల్లో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని ఐటీ కంపెనీలు తమకు అవసరమైనప్పుడల్లా ఫ్రెషర్లను తీసుకుని , అవసరమైన నైపుణ్యాల్లో వారికి శిక్షణ ఇస్తూ వినియోగించుకుంటున్నాయి. దీనికి తగ్గట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తీసుకోవట్లేదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆఫర్ లెటర్లు పంపిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది అందుకే కొత్తవారిని తీసుకోవడం లేదని ఐటీ కంపెనీలు తెలుపుతున్నాయి. హెచ్‌సీఎల్ ప్రస్తుతం ఏడాది 10 వేల ఫ్రెషర్లను నియమించుకుంటామని గతంలోనే ప్రకటించింది. టీసీఎస్ కూడా ఈ ఏడాది 40 వేల మందిని నియామకం చేసుకుంటామని తెలిపింది.
Also Read: భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన బ్యాంకింగ్ దిగ్గజం!