Indian Students In Kyrgyzstan : కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను(Indian Students) కేంద్ర ప్రభుత్వం(Central Government) అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్(X) లో పోస్టు చేసింది. ‘ మన భారత విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అయినాకూడా విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైన సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయన్ని సంప్రదించాలి అంటూ’ పేర్కొంది. అలాగే 24 గంటలు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ ను(0555710041) కూడా షేర్ చేసింది.
పూర్తిగా చదవండి..Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో హింసాత్మక ఘటన.. భారత విద్యార్థులకు కేంద్రం ఆదేశాలు
కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది.
Translate this News: