Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో హింసాత్మక ఘటన.. భారత విద్యార్థులకు కేంద్రం ఆదేశాలు

కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది.

New Update
Crime News: కిర్గిస్థాన్‌ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..!

Indian Students In Kyrgyzstan : కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను(Indian Students) కేంద్ర ప్రభుత్వం(Central Government) అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్‌(X) లో పోస్టు చేసింది. ' మన భారత విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అయినాకూడా విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైన సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయన్ని సంప్రదించాలి అంటూ' పేర్కొంది. అలాగే 24 గంటలు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్‌ ను(0555710041) కూడా షేర్ చేసింది.

Also Read: భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా.

కిర్గిస్థాన్, ఈజిప్ట్(Egypt) దేశాలకు చెందిన విద్యార్థుల మధ్య మే 13న ఘర్షణలు జరిగిన వీడియోలు శుక్రవారం వైరల్ కావడంతోనే ఈ దాడులకు దారితీసిందని పాకిస్థాన్‌ ఎంబసీ చెప్పింది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఇదిలాఉండగా.. ఈరోజు ఉదయం విదేశాంగ మంత్రి జై శంకర్‌ కూడా కిర్గిస్థాన్‌లో జరిగిన అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎంబసీతో టచ్‌లో ఉండాలని అక్కడి విద్యార్థులకు సూచించారు. అయితే ఈ మూక దాడిలో పలువులు పాకిస్థానీ విద్యార్థులు గాయపడటంతో కిర్గిస్థాన్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ.. భారతీయ విద్యార్థులకు సూచనలు చేసింది. మరోవైపు ముగ్గురు పాకిస్థాన్ విద్యార్థులు మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

Also read: భారత్, మాల్దీవుల వివాదంతో..లాభ పడుతున్న శ్రీలంక..

Advertisment
తాజా కథనాలు