America Gunfire: అమెరికాలో మరో దారుణం జరిగింది. పై చదువులకోసం అమెరికా వెళ్లిన భారతీయ వైద్య విద్యార్థి దుండగుల కాల్పుల్లో మరణించాడు. ఈ నెల 9న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సీటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ లో మాలిక్యూలర్ అండ్ డెవలప్ మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్ లో నాలుగొవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదిత్యగా వైద్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.
Also read :విక్రమ్ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ
ఈ మేరకు అమెరికాలోని ఓహియోలో నవంబర్ ఉదయం 6 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు. ఓహియో రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో డాక్టరేట్ చేస్తున్న ఆదిత్యపై (26) ఈ నెల 9న కారులో వెళ్తుండగా దుండగులు దారుణంగా కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆదిత్య కంట్రోల్ తప్పిపోగా.. కారు అదపుతప్పి గోడను బలంగా ఢీకొట్టింది. విషయం గమనించిన స్థానికులు సమాచారం అందించారు. బుల్లెట్ గుర్తులు ఉన్న కారు, లోపల గాయపడిన ఉన్న ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించాం. అయితే తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈ నెల 18న చనిపోయాడు. అయితే ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించింది వైద్య విశ్వవిద్యాలయం. ఢీల్లీలోని రాంజస్ కాలేజీలో బీఎస్పీ, 2020లో ఎయిమ్స్ లో ఫిజాయాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు అదిత్య. ఈ విషాదకరమైన సంఘటన భారతీయులను ఆందోళనకు గురిచేస్తుంది.