Indian Rupee : ఇండోనేషియాలో కూడా మన రూపాయి.. కుదిరిన ఎంవోయూ! ఇకపై మన రూపాయి ఇండోనేషియాలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఎటువంటి మారకం చేయకుండానే నేరుగా మన రూపాయల్ని ఇండోనేషియాలో ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. By KVD Varma 08 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Indian Currency : భారతదేశం(India) ప్రపంచంలోని అనేక దేశాలతో రూపాయిల వాణిజ్యాన్ని నిరంతరం ప్రోత్సహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసిన సందర్భంలో, భారతదేశం రూపాయిలలో బిజినెస్ చేసింది. అప్పుడు ముడి చమురును తగ్గింపుతో కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ భారతీయ రూపాయి ఇండోనేషియాలో కూడా పని చేస్తుంది. ప్రజలు కరెన్సీ మార్పిడి లేదా డాలర్ ఏర్పాట్లు లేకుండా ఇండోనేషియాతో వ్యాపారం చేయగలుగుతారు. ఇందుకోసం భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ, బ్యాంక్ ఇండోనేషియా మధ్య ఎంఓయూ కుదిరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), బ్యాంక్ ఇండోనేషియా (బిఐ) గురువారం ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాలు ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. ఇందులో భారత రూపాయి(Indian Rupee), ఇండోనేషియా రూపాయి రెండూ ఉన్నాయి. రూపాయి-రూపీ లావాదేవీల వ్యవస్థను రూపొందించనున్నారు ఇరు దేశాల మధ్య సరిహద్దు లావాదేవీల కోసం వ్యవస్థను రూపొందిస్తామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ రూపాయి - ఇండోనేషియా రుపియా(IDR) లో లావాదేవీలను ప్రారంభించడానికి, రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇరు దేశాల ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఎంతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు మన దేశీయ కరెన్సీ(Indian Rupee) లో బిల్లులు - చెల్లింపులు చేయగలడు. Also Read : 16 ఏళ్ల టీనేజ్ పిల్ల.. రూ.100 కోట్ల కంపెనీ.. ఈ కథ వింటే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేరు! ఇండోనేషియా రూపాయి-భారత రూపాయి మధ్య విదేశీ మారకపు మార్కెట్ అభివృద్ధి చెందడం ఈ ఏర్పాటు మరొక ప్రయోజనం. అదే సమయంలో, విదేశీ కరెన్సీగా భారత రూపాయికి డిమాండ్, విశ్వసనీయత పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది.. సమయం తగ్గుతుంది ఆర్‌బిఐ(RBI) ప్రకటన ప్రకారం, డాలర్ కాకుండా దేశీయ కరెన్సీ(Indian Rupee) లో వ్యాపారం చేయడం ద్వారా దాని ఖర్చు తగ్గుతుంది. అలాగే, లావాదేవీని సెటిల్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది. ఈ ఎంఓయూపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం RBI - BI మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ద్వైపాక్షిక లావాదేవీలలో స్థానిక కరెన్సీల వినియోగం అంతిమంగా భారతదేశం-ఇండోనేషియా మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఆర్థిక ఏకీకరణకు, పురాతన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదం చేస్తుందని ప్రకటన పేర్కొంది. #indonesia #rbi #indian-rupees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి