/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/India-Corona-Cases-jpg.webp)
India Corona Cases: దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మొత్తం 5,33,327 మంది మరణించినట్లు తెలిపింది. కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ జేఎన్.1 కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పేర్కొంది. కేరళలో ఈ వైరస్ కారణంగా బుధవారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయినట్లు తెలిపింది. దేశంలో నమోదు అయిన కొత్త కేసుల్లో 300 మంది కేరళకు చెందిన వారు కావడం గమనార్హం. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ పెడుతారా? అనే చర్చ దేశంలో మొదలైంది. ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి ఏంటా? అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఎన్ని కేసులంటే..
తెలంగాణలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 538 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. వీరిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గురువారం నాడు కూడా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఫీవర్ హాస్పిటల్‌లోనే రెండు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
Also Read:
ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..
విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..