Train Accidents in India: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది!

ఇటీవల రైలు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. NCRB రికార్డుల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2.60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 70శాతం 2017-21 మధ్య జరిగినవే ఉండడం గమనార్హం.

author-image
By Nikhil
Train Accidents in India: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది!
New Update

వామ్మో.. ట్రైన్ ఎక్కాలంటేనే భయం పుడుతుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటివలి రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ రైలు పట్టాలు తప్పుతుందో తెలియక.. ఏ ట్రైన్‌లో మంటలు వస్తాయో అర్థంకాక.. రైలు ప్రయాణం అతి పెద్ద గండంగా మారింది. గత 10ఏళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2014 తర్వాత రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ఈ పదేళ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది రైలు ప్రమాదాల్లో చనిపోయారు.

ఇటీవలి కాలంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురవుతున్నాయి. విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్, హౌరా- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ మధ్య కాలంలో ప్రమాదానికి గురయ్యాయి. ఇక గత జులైలోనే వరుసగా ఆరు రైలు ప్రమాదాలు జరగడం కలవర పెడుతోంది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు.

2023 జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని 288 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ రైల్వేలు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నాటి ఘటన చర్చకు దారితీసింది. అయితే ఆ తర్వాత కూడా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-NCRB రికార్డుల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 70శాతం 2017-21 మధ్య జరిగినవే ఉన్నాయి.

రైలు ప్రమాదం అంటే కేవలం ట్రైన్స్‌ ఢీకొనడం లేదా రైలు పట్టాలు తప్పడం వల్ల చనిపోవడం మాత్రమే కాదు. ఇందులో చాలా క్యాటగిరీలు ఉన్నాయి.
చాలా మరణాలు రైళ్లలో నుంచి పడిపోవడం లేదా ట్రైన్‌ వెనుకల పరిగెత్తడం వల్ల సంభవించాయని డేటా చెబుతోంది. NCRB ప్రకారం, 2021లో జరిగిన మొత్తం రైల్వే ప్రమాద మరణాలలో, 11వేల మరణాలు ఈ కేటగిరీ కిందకు వచ్చాయి. పట్టాలు తప్పి చనిపోయిన వారి కంటే ఇలా ట్రైన్‌లో నుంచి దూకి మరణించిన వారి సంఖ్యే ఎక్కువ!

దేశంలో తరుచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2018-19 తర్వాత ఏడాదికి సగటున 40 రైళ్ల ప్రమద ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో చాలా వరకు రైలు పట్టాలు తప్పినవే ఉన్నాయి. మరోవైపు రైల్వేల నిర్వహణలో కేంద్రం విఫలమైందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఓవైపు వరుస ప్రమాదాలు జరుగుతుండగా.. మరోవైపు కనీస మెరుగైన ట్రాక్‌లను అభివృద్ధి చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇక సిగ్నలింగ్, భద్రతా పరికరాలను ఆధునీకరించకుండా బుల్లెట్ రైళ్లు, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఏంటో అర్థంకాని పరిస్థితి.

ఇక గతంలో రైల్వేల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉండేది.. అయితే 2017 తర్వాత యూనియన్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలిపేశారు. ఇది మూర్ఖపు నిర్ణయమని మెట్రో మ్యాన్ శ్రీధరన్ విమర్శించారు. ఇక 2023లో 278 మంది ప్రయాణికుల మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తప్పు అని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అంగీకరించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ రైల్వేను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేలా ఉన్నాయని ఆరోపణలున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe