వామ్మో.. ట్రైన్ ఎక్కాలంటేనే భయం పుడుతుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటివలి రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ రైలు పట్టాలు తప్పుతుందో తెలియక.. ఏ ట్రైన్లో మంటలు వస్తాయో అర్థంకాక.. రైలు ప్రయాణం అతి పెద్ద గండంగా మారింది. గత 10ఏళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2014 తర్వాత రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ఈ పదేళ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది రైలు ప్రమాదాల్లో చనిపోయారు.
Train Accidents in India: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది!
ఇటీవల రైలు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. NCRB రికార్డుల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2.60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 70శాతం 2017-21 మధ్య జరిగినవే ఉండడం గమనార్హం.
Translate this News: