Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.. ఇది ఎక్కడుందో తెలుసా? ఇండియన్ రైల్వేస్‌లో ఓ రైల్వే స్టేషన్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి వీసా అవసరం. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే, అక్కడ పాకిస్తాన్ వీసా ఉండాలి. By Shiva.K 04 Sep 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Indian Railways: బస్ ఎక్కి ప్రయాణించాలంటే.. బస్ టికెట్ తీసుకోవాలి. అదే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లాలంటే.. తప్పకుండా వీసా, పాస్‌పోర్ట్ ఉండాలి. మరి ట్రైన్ ఎక్కి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలంటే.. ఇంకేముంది ట్రైన్ టికెట్(Train Ticket) తీసుకోవాలి అని అంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అవును మరి. ఇక్కడ ట్రైన్(Train) ఎక్కాలంటే.. ఉండాల్సింది ట్రైన్ టికెట్ కాదు.. వీసా, పాస్‌పోర్ట్. ట్రైన్ ట్రావెలింగ్‌కు వీసా, పాస్‌పోర్ట్ ఏంటి సామీ అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా నిజం.. ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మీ వద్ద పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం దేశంలోనే ఉన్న ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ అవడానికి పాస్‌పోర్ట్, వీసా ఎందుకో ఓసారి వివరాలను చూద్దాం.. ఇండియన్ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్, ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. భారతదేశంలోని మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య దాదాపు 8000. ప్రభుత్వం ఈ స్టేషన్లలో కొన్నింటిని తిరిగి అభివృద్ధి చేస్తోంది. మరికొన్ని స్టేషన్లు ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక హైస్పీడ్ రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించడానికి ఒక కారణం సౌకర్యంగా ఉండటం, ఎక్కువ దూరాన్ని సైతం తక్కువ సమయంలో చేర్చడం, ఛార్జీలు కూడా తక్కువగా ఉండటం. అయితే, ఇవాళ మనం ఓ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ గురించి తెఉలసుకుందాం. అక్కడికి వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరిగా కావాలి. వీసా కలిగిన ఏకైక రైల్వే స్టేషన్.. ఇండియన్ రైల్వేస్‌లో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్లడానికి వీసా అవసరం. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే, అక్కడ పాకిస్తాన్ వీసా ఉండాలి. ఈ రైల్వే స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్. ఇది పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. ఉత్తర రైల్వేలోని ఫిరోజ్‌పూర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వస్తుంది. వీసా ఎందుకు.. అట్టారి రైల్వే స్టేషన్ భారతదేశంలో ఒక భాగం. అయితే, ఇది పాక్-భారత్ బోర్డర్‌లో ఉంది. ఈ కారణంగానే ఈ స్టేషన్‌ను సందర్శించడానికి పాకిస్తాన్ అనుమతి కూడా అవసరం. ఈ రైల్వే స్టేషన్‌లో పాస్‌పోర్ట్, వీసా లేకుండా తిరిగితే అరెస్ట్ చేస్తారు అధికారులు. జరిమానా కూడా విధిస్తారు. ఏ రైళ్లు నడుస్తాయి.. ఈ స్టేషన్ నుంచి ప్రయాణించాలనుకుంటే, టికెట్ కొనడానికి పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్ గుండా ఢిల్లీ-అత్తారి ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-అట్టారి డెమో, జబల్‌పూర్-అట్టారి ప్రత్యేక రైళ్లు సహా సంఘౌతా ఎక్స్‌ప్రెస్, కొన్ని ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి. అయితే, ప్రస్తుతం ఈ స్టేషన్‌ను మూసివేయడంతో పాటు.. సంఘౌతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కూడా రద్దు చేశారు. अब सरकारी कर्मचारी पा सकते है आईआरसीटीसी एयर के साथ टिकट बुकिंग कर एलटीसी किराये की सुविधा। अधिक जानकारी और अन्य ऑफर्स के बारे में जानने के लिए आज ही https://t.co/fLKvfBLWUz पर जाएँ।#airtravel #TicketsBooking #Offers pic.twitter.com/3E9totwjOo — IRCTC (@IRCTCofficial) September 4, 2023 Also Read: CM KCR: గురుకుల కాంట్రాక్ట్ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. వారందరినీ క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు.. LB Nagar Sanghavi: పాపం సంఘవి జీవితాంతం ఇంతేనా.. హెల్త్ బులిటెన్‌లో షాకింగ్ విషయాలు #indian-railways #irctc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి