Indian Railways: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. భద్రతా పరమైన పనుల కారణంగానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎస్‌సీఆర్ రద్దు చేసిన ట్రైన్స్‌లో ప్యాసింజర్ రైళ్లు సహా.. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూడా ఉంది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రద్దైన రైళ్లు..
🚂 రాజమండ్రి - విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ (07466)ను అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రద్దు చేశారు. ఇదే తేదీల్లో తిరుగు పయనమయయే ట్రైన్ (07467)ను కూడా రద్దు చేశారు.
🚂 విశాఖపట్నం - విజయవాడ మధ్య నడిచే డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) ట్రైన్‌ను అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇదే తేదీల్లో తిరుగు ప్రయాణమయ్యే రైల్‌ను కూడా రద్దు చేయడం జరిగింది.
🚂 వీటితోపాటు అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
🚂 విశాఖపట్నం- కిరండూల్ (18514) నైట్ ఎక్స్‌ప్రెస్ కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణం అవుతుంది.
🚂 హౌరా - జగ్దల్‌పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ నుంచి హౌరాకు తిరిగి ప్రయాణం అవుతుంది.
🚂 భువనేశ్వర్-జగ్దల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) కొరాపుట్ నుంచి తిరిగి ప్రయాణం అయ్యి భువనేశ్వర్ చేరుతుంది.
ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!