Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రబాద్-విజయవాడ మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ర్దదు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అధికారుల ప్రకటన ప్రకారం.. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా డిసెంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లను ఆపేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, డిసెంబర్ 5వ తేదీ నుంచే ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, కాజీపేట-డోర్నకల్ పుష్‌పుల్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఇక ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును కేవలం గుంటూరు నుంచి కాజీపేట వరకే నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read:
ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!
పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి