RRB JOBS: పది అర్హతతో.. రైల్వే శాఖలో 1,376 ఉద్యోగాలు! భారత రైల్వే శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. By srinivas 12 Aug 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి RRB Recruitment 2024: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే భారీ నోటఫికేషన్ రిలీజ్ చేసిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. విభాగాల వారీగా ఖాళీలు: 1376 నర్సింగ్ సూపరింటెండెంట్ 713, డైటీషియన్ (లెవల్-7) 05, అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ 04, క్లినికల్ సైకాలజిస్ట్ 07, డెంటల్ హైజీనిస్ట్ 03, డయాలసిస్ టెక్నీషియన్ 20, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III 126, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 27, పెర్ఫ్యూషనిస్ట్ 02, స్పీచ్ థెరపిస్ట్ 01, కార్డియాక్ టెక్నీషియన్ 04, ఆప్టోమెట్రిస్ట్ 04, ఈసీజీ టెక్నీషియన్13, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II 94, ఫీల్డ్ వర్కర్ 19 ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II 20, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 02, క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 02, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) 246, రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ 64, విద్యార్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు తేది: ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ వరకూ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు. పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులు రూ. 500 చెల్లించాలి. ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100లకు ఉంటుంది. పరీక్ష సమయం.. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. భర్తీ చేసే రీజియన్లు: అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సెట్: https://indianrailways.gov.in/ #indian-railways #1 #376-para-medical-jobs-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి