JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్

భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్‌ల పరిధిలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

New Update
JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్

Railway JOBS:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే (Indian railway)  నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేలోని పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు అసిస్టెంట్‌ లోకోపైలట్‌ (Locopilot) ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసిస్టెంట్ లోకో పైలట్..
ఈ మేరకు మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రైల్వే జోన్‌ల పరిధిలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. జోన్‌ల వారీగా పోస్టుల ఖాళీల వివరాల జాబితా ఇంకా విడుదలచేయలేదు.

దరఖాస్తు..
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి : JOBS: 60వేల ఉద్యోగాలకు 50 లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

విద్యా అర్హతలు:
సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. అంతేకాదు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వాళ్లూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు:
2024 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక:
కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల్లో మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదట రూ.19,900 వేతనం అందిస్తారు. దీంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తారు.

అధికారిక వెబ్ సైట్ : https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

Advertisment
తాజా కథనాలు