Paris Olympics 2024 Schedule: పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే!

ఈరోజు ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్‌లో స్వప్నిల్ ఫైనల్స్‌లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్ రేస్ వాకింగ్‌లో పోటీపడనున్నారు. వీరు మనకు పతకాలు తెచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చూడండి

New Update
Paris Olympics 2024 Schedule: పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే!

Paris Olympics 2024 Schedule: ఈరోజు అంటే ఆగస్టు 1న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మూడు పతకాల కోసం పోటీ పడుతున్నారు. షూటింగ్‌లో స్వప్నిల్ ఫైనల్స్‌లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్, వికాష్ సింగ్, ప్రియాంక గోస్వామి అట్టా రేస్ వాకింగ్‌లో పోటీపడనున్నారు. కాబట్టి ఈరోజు పోటీల్లో భారత్ పతకం కోసం ఎదురుచూడవచ్చు.

పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లోకి ప్రవేశించాడు . దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఈరోజు జరిగే ఫైనల్ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కూడా పోటీపడుతుండడంతో భారత్ మూడో పతకాన్ని ఆశించవచ్చు.

దీంతో పాటు రేస్ వాకింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, హాకీల్లో భారతీయులు పోటీపడనున్నారు. చాలా మ్యాచ్‌లు క్వార్టర్ ఫైనల్స్ కావడంతో తదుపరి స్థాయికి వెళ్లేందుకు నేటి మ్యాచ్‌లు కీలకం. దీని ప్రకారం, ఈ రోజు భారత అథ్లెట్లు పోటీపడే ఈవెంట్‌ల పూర్తి షెడ్యూల్ క్రింది విధంగా ఉంది…

ఆగస్టు 1న భారత క్రీడాకారుల షెడ్యూల్:

అథ్లెటిక్స్: 

  • 11 AM IST – పురుషుల రేస్‌వాకింగ్ ఫైనల్: పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్, వికాష్ సింగ్ (పతక రేసు)
  • 12:50 PM IST – మహిళల రేస్‌వాకింగ్ ఫైనల్: ప్రియాంక గోస్వామి (పతక రేసు)

బ్యాడ్మింటన్:

  • 4:30 PM IST- పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి & చిరాగ్ శెట్టి vs ఆరోన్ చియా & సోహ్ వూయ్ యిక్ (మలేషియా)
  • 5:40 PM IST – పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ vs హెచ్ఎస్ ప్రణయ్
  • 10 PM నుండి – మహిళల సింగిల్స్: PV సింధు vs హే బింగ్ జియావో

గోల్ఫ్:

  • 12:30 PM IST – పురుషుల వ్యక్తిగత రౌండ్ – గగన్‌జీత్ భుల్లర్ మరియు శుభంకర్ శర్మ

షూటింగ్:

  • 1 PM IST – పురుషుల 50 మీ రైఫిల్ ఫైనల్ – స్వప్నిల్ కుసాలే
  • 3:30 PM IST – మహిళల 50 మీటర్ల రైఫిల్ క్వాలిఫైయర్స్ – సిఫ్ట్ కౌర్ సమ్రా మరియు అంజుమ్ మౌద్గిల్

హాకీ:

  • 1:30 PM IST - భారత్ vs బెల్జియం

బాక్సింగ్:

  • 2:30 PM IST – మహిళల 50 కేజీలు: నిఖత్ జరీన్ vs వు యు (చైనా)

ఆర్చరీ:

  • 2:31 PM IST – పురుషుల రౌండ్-16: ప్రవీణ్ జాదవ్ vs కై వెంచావో (చైనా)

సెయిలింగ్:

  • 3:45 PM IST- పురుషుల డింగీ రేస్ 1 – విష్ణు శరవణన్
  • 5:50 PM IST పురుషుల డింగీ రేస్ 2 – విష్ణు శరవణన్
  • 7:05 PM IST మహిళల డింగీ రేస్ 1 – నేత్ర కుమనన్
  • 8:13 PM IST మహిళల డింగీ రేస్ 2 – నేత్ర కుమనన్

Advertisment
Advertisment
తాజా కథనాలు