Hijack: ఓడను హైజాక్‌ చేసేందుకు దొంగల ప్రయత్నం..తిప్పికొట్టిన భారత నేవీ!

సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు అనూహ్యంగా ప్రవేశించారు. దీంతో నౌక నుంచి అత్యవసర కాల్‌ రావడంతో అప్రమత్తమైన భారత నేవీ సిబ్బంది అప్రమత్తమై వారిని తిప్పి కొట్టాయి.

New Update
Hijack: ఓడను హైజాక్‌ చేసేందుకు దొంగల ప్రయత్నం..తిప్పికొట్టిన భారత నేవీ!

అరేబియా సముద్రంలో(Arebian Sea)  దొంగలు ఓ కార్గో షిప్‌(Cargo ship)ను హైజాక్‌ చేసే ప్రయత్నాన్ని భారత నావికాదళం తిప్పికొట్టింది. ఈ విషయం గురించి నావికాదళ అధికారులు శనివారం తెలిపారు. మాల్టా ఫ్లాగ్‌ తో ఉన్న కార్గో షిప్‌ ఎంవీ రూవెన్‌ ను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే భారత నేవీ అధికారులు స్పందించినట్లు అధికారులు వివరించారు.

ఈ నౌక ఐరోపా దేశానికి చెందిన మాల్డాకు చెందిన కార్గో షిప్‌. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు అనూహ్యంగా ప్రవేశించారు. దీంతో నౌక నుంచి అత్యవసర కాల్‌ రావడంతో అప్రమత్తమైన భారత నేవీ సిబ్బంది వెంటనే దానిని కాపాడేందుకు విమానాలు, యుద్ద నౌకలు ఎంటర్‌ అయ్యాయి.

డిసెంబర్‌ 14 రాత్రి సమయంలో ఓడ ఎంవీ రుయెన్‌ యూకే మెరైన్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ పోర్టల్‌ లో మేడే సందేశాన్ని పంపించింది. ఓడ హైజాక్‌ కు గురైన ఓడలో 18 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓడ మీదుగా భారత్‌ నావికాదళ విమానం ఎగురుతోంది. శనివారం ఉదయం రోవెన్‌ నౌకను భారత యుద్ద నౌక అడ్డుకున్నట్లు నేవీ తెలిపింది.

2017 తరువాత ఓడలపై సోమాలియ సముద్రపు దొంగలు జరిపిన అతి పెద్ద దాడి ఇదే అని చెప్పవచ్చు. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also read: హైదరాబాద్‌కి సింహం లాంటి కుక్క.. ధర రూ.20 కోట్లు..!

Advertisment
తాజా కథనాలు