Jobs: ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండిలా!

భారత నేవీలో అప్రెంటిస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 275 ఖాళీలకు గానూ ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందుకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలని అధికారులు వివరించారు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 1 , 2024.

Jobs: ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండిలా!
New Update

భారత నావికాదళం లో 275 అప్రెంటీస్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విశాఖలోని నావల్‌ డాక్‌యార్డ్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు ఉన్న పోస్టులు ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, కార్పెంటర్‌, మెకానికల్‌ , పైప్‌ ఫిట్లర్‌, ఎలక్ట్రిషియన్‌, పెయింటర్‌, ఏసీ మెకానిక్‌, వెల్డర్‌, మెషినిష్ట్‌, ఇన్‌స్ట్రూమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌ , ఫౌండ్రీ మ్యాన్‌ ఈ విభాగాలకు సంబంధించి మొత్తం 275 ఖాళీలను పూరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 65 శాతం మార్కులతో ఐటీఐ పూర్తి అయ్యి ఉండాలి. అభ్యర్థులకు కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల్లో పని చేసే వారికి మాత్రం కనీసం వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి.

ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం ట్రైనింగ్‌ లో నెలకు రూ. 7,700 అందిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ. 8,050 చొప్పున అందజేస్తారు. దీని కోసం ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని సర్టిఫికేట్లలో పేరు, పుట్టిన తేదీ ఒకేలా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే అన్ని సరి చేసుకోవాలి.

అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్లో తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్​, ఈ-మెయిల్ లాంటి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక యూజర్​ నేమ్​, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.మీరు ఈ యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​లతో మళ్లీ https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లోకి లాగిన్ అయ్యి మీ విద్యార్హతల వివరాలు, చిరునామా, ట్రేడ్ ప్రిఫరెన్స్​, ఆధార్​, పాన్​, బ్యాంక్ డీటైల్స్​, కమ్యూనిటీ వివరాలు నమోదు చేయాలి.

ముఖ్యమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. తరువాత ఆధార్​ నంబర్​ను సరిచూసుకోవాలి. తరువాత..అన్ని వివరాలను మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్​ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ : జనవరి 1, రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి 28, పరీక్ష ఫలితాల వెల్లడి : మార్చి 02 , ఇంటర్వ్యూ తేదీ : మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు.

Also read: మెట్రో ఎక్కిన కేటీఆర్‌.. ప్రచారం చేసిన మంత్రి!

#jobs #navy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe