Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక

హమాస్ చీఫ్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. ఇజ్రాయిల్‌పై దాడి చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఆ రెండు దేశాలకు వెళ్లకూడని దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

New Update
Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక

Iran Attack: టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతితో ఇరాన్ దిగ్భ్రాంతికి గురైంది. దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్ నిరంతరం హెచ్చరిస్తూనే ఉంది. ఈసారి ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను టార్గెట్ చేయనున్నట్లు ఓ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. గతంలో జరిగిన దాడికి భిన్నంగా ఈసారి టార్గెట్ పెద్దదిగా ఉంటుందని, టెల్ అవీవ్, హైఫా వంటి నగరాలను టార్గెట్ చేయనున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

గత సారి ఇరాన్ ఆపరేషన్ కొన్ని లక్ష్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోగా, రాబోయే ఆపరేషన్ ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలైన టెల్ అవీవ్, హైఫా, వ్యూహాత్మక కేంద్రాలు.. హత్యలను లక్ష్యంగా చేసుకుంటుందని సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ నిర్వహించే వార్తాపత్రిక కేహాన్‌లోని కథనం పేర్కొంది. హనియా ప్రమేయం ఉన్న ఇజ్రాయెల్ అధికారుల ఇళ్లను టార్గెట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈసారి దాడి పెద్దదిగానూ, ప్రమాదకరంగానూ ఉంటుందని, అడ్డుకోవడం కూడా కష్టమేనని కథనంలో తెలిపారు.

ఈ క్రమంలో అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి. ఆ రెండు దేశాలకు వెళ్లకూడని వారి వారి దేశ ప్రజలకు హెచ్చరించింది. ఈ క్రమంలో భారత్ కూడా ఆ దేశాలకు వెళ్లే వారు ఉంటే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరింది. అక్కడ జరిగే దాడి వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు