Forex Reserves: దేశంలో రికార్డు స్థాయికి చేరిన ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా బోలెడు ఉంది!

దేశంలో ఫారెక్స్(విదేశీ మారక ద్రవ్యం)  నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బంగారం నిల్వలు కూడా బాగా పెరిగాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. మన ఫారెక్స్ నిల్వలు జూలై 5 నాటికి 5.16 బిలియన్ డాలర్లు పెరిగి 657.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

Forex Reserves: దేశంలో రికార్డు స్థాయికి చేరిన ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా బోలెడు ఉంది!
New Update

Forex Reserves: మన దేశ ఫారెక్స్ నిల్వలు జూలై 5న  657.16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ఇది భారతదేశ ఫారెక్స్ చరిత్రలో అత్యధిక ఫారెక్స్ ఫండ్ సేకరణగా చెబుతున్నారు. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూలై 5తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు పెరగడంతోపాటు బంగారం నిల్వలు కూడా పెరిగాయి.  జూలై 5తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 5.16 బిలియన్ డాలర్లు పెరిగి 657.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారతదేశ ఫారెక్స్ నిల్వలలో ఇప్పటివరకు చూడని అత్యధిక సేకరణ. ఇటీవల ఆర్బీఐ ఈ డేటాను విడుదల చేసింది. 

Forex Reserves: అంతకు మునుపటి వారంలో అంటే జూన్ 28న ఫారెక్స్ రిజర్వ్ ఫండ్ $1.71 బిలియన్లు తగ్గింది. జూలై 5న పెరిగిన ఫారెక్స్ నిల్వల్లో $5.16 బిలియన్లలో విదేశీ కరెన్సీ ఆస్తులు $42.29 మిలియన్లు పెరిగాయి. ఫారెక్స్ ఫండ్స్‌లో ఈ విదేశీ కరెన్సీ హోల్డింగ్‌లు అత్యధికం. ఇంకా, బంగారం నిల్వలు 904 మిలియన్ డాలర్లు పెరిగాయి. SDRల మొత్తం 21 మిలియన్ డాలర్లు పెరిగింది.  IMF వద్ద నిల్వలు 4 మిలియన్ డాలర్లు పెరిగాయి.

జూలై 4, 2024 నాటికి భారతదేశం ఫారెక్స్ నిల్వల మొత్తం

మొత్తం ఫారెక్స్ నిల్వలు: 657.16 బిలియన్ డాలర్లు

  • విదేశీ కరెన్సీ ఆస్తులు: 577.11 బిలియన్ డాలర్లు
  • బంగారం నిల్వలు: 57.43 బిలియన్ డాలర్లు
  • ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు: 18.04 బిలియన్ డాలర్లు
  • IMFతో రిజర్వ్ స్థాయి: $4.58 బిలియన్.

Also Read: విలేజ్ స్టార్టప్స్ కోసం ప్రభుత్వ సహకారం.. కోట్లాది రూపాయల నిధులు అందుబాటులో.. 

చైనాలో అతి ఎక్కువ ఫారెక్స్ నిల్వలు
Forex Reserves: ఒక దేశం కరెన్సీ విలువను రక్షించడానికి..  అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి సెంట్రల్ బ్యాంకులు విదేశీ ఆస్తులను అంటే ఫారెక్స్ రిజర్వ్స్ కూడబెట్టుకుంటాయి. చైనాలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. చైనా వద్ద 3.58 లక్షల కోట్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల జాబితా ఇక్కడ చూడొచ్చు. 

  1. చైనా: $3.58 ట్రిలియన్
  2. జపాన్: 1.83 ట్రిలియన్ డాలర్లు
  3. స్విట్జర్లాండ్: 1.29 ట్రిలియన్ డాలర్లు
  4. భారతదేశం: 657.16 బిలియన్ డాలర్లు
  5. రష్యా: 572 బిలియన్ డాలర్లు
#rbi #forex-reserves
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe