Oscar Awards: 2024 ఆస్కార్ నామినేషన్స్ లో మరో తెలుగు సినిమా.. ఏంటో తెలుసా..?

2024 ఆస్కార్ సందడి మొదలైంది. ఈ ఏడాది భారత దేశం నుంచి పలు చిత్రాలను ఆస్కార్ కు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే దీ స్టోరీ టెల్లర్, సంగీత పాఠశాల, శ్రీమతి ఛటర్జీ VS నార్వే డంకీ, మరి కొన్ని చిత్రాలు నామినేట్ అయ్యాయి. పూర్తి లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Oscar Awards: 2024 ఆస్కార్ నామినేషన్స్ లో మరో తెలుగు సినిమా.. ఏంటో తెలుసా..?

Oscar Awards: 2023 లో సినిమా ఇండస్ట్రీ ఎన్నో గొప్ప విజయాలను అందుకుంది వాటిలో ఒకటి RRR సినిమా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం. తెలుగు చిత్రం RRR సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ గెల్చుకున్న మొదటి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృస్థించింది. గత ఏడాది నిర్వహించిన 95th అకాడమీ అవార్డ్స్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో "నాటు నాటు" పాట (Naatu Naatu Song) ఆస్కార్ అవార్డును సొంత చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ పాటకు ఆస్కార్ పురస్కారాన్నీ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రమే కాదు భారత దేశం నుంచి ఎలిఫాంట్ విష్పర్స్ అనే డాక్యుమెంట్రీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది.

2024 ఆస్కార్ అవార్డ్స్

సినిమా రంగంలో ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. చిత్ర పరిశ్రమలో కళా నైపుణ్యానికి, సాంకేతిక ప్రతిభకు గుర్తుగా ఈ అవార్డులను అందిస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల చిత్ర పరిశ్రమలు ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడతారు. నటీ నటులు, సినిమాలు ఈ అవార్డ్స్ కు నామినేట్ అవ్వడమే గొప్ప విషయంగా భావిస్తారు. గత ఏడాది నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పెంచింది. ఇక ఇప్పుడు 2024 ఆస్కార్ సందడి మొదలైంది. ఈ ఏడాది భారత దేశం నుంచి పలు చిత్రాలను ఆస్కార్ కు ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పటికే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఆస్కార్ కు నామినేట్ అయినా భారతీయ చిత్రాలు

  • దీ స్టోరీ టెల్లర్ (హిందీ)
  • సంగీత పాఠశాల (హిందీ)
  • శ్రీమతి ఛటర్జీ VS నార్వే (హిందీ)
  • డంకీ (హిందీ)
  • 12TH ఫెయిల్ (హిందీ)
  • విడుతలై పార్ట్ 1 (తమిళ్)
  • ఘూమర్(హిందీ)
  • దసరా (తెలుగు)
  • జ్వీగాటో (హిందీ)
  • రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)
  • కేరళ స్టోరీస్ (హిందీ)
  • ఇప్పటి వరకు ఈ సినిమాలు నామినేట్ అయినట్లు సమాచారం. ఇంకా మరి కొన్ని భారతీయ చిత్రాలు ఆస్కార్ జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు