Indian Badminton : తిరుమల(Tirumala) శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.ఆలయం వెలుపల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ…. శ్రీ రామ నవమి(Sri Rama Navami) నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మలేసియా., ఇండోనేషియాలో టోర్నమెంట్స్లలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఒలిపిక్స్ కి కూడా సిద్దం అవుతున్నట్లు పీవీ సింధు తెలిపారు.2013లో చైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించింది. ఈ ఛాంపియన్ షిప్లో పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఇక 2015లో పీవీ సింధుకు భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. 2016 ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరుకుంది.
సెమీఫైనల్ లో జపాన్ కు చెందిన నోజోమీని ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అత్యంత చిన్న వయస్సులో గెలుచుకున్న భారతీయురాలిగా నిలిచింది.
Also Read : సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!