Budameru: యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు

AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ ఆర్మీ జవాన్లు ఈ పూడ్చివేతలో పాల్గొంటున్నారు. పూడ్చివేత పనులు దాదాపు అయిపోయినట్లు తెలుస్తోంది. బుడమేరు వాగుకు గండ్లు పడడంతో విజయవాడ నీటమునిగిన విషయం తెలిసిందే.

Budameru: యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు
New Update

Budameru: విజయవాడ వరద బీభత్సానికి కారణమైన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గండ్ల పూడ్చివేత పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వందకు పైగా లారీలు, జేసీబీలు, కాంట్రాక్టు ఏజెన్సీ సిబ్బంది ఈ పనుల్లో పాల్గొన్నారు. ఆర్మీ రంగంలోకి దిగడంతో పనులు చకచకా జరుగుతున్నాయి.



బుడమేరు పూడ్చివేత పనుల్లో చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. బెటాలియన్‌కు చెందిన 120 మంది జవాన్లు ఉన్నారు. ఇనుప జాలీల్లో రాళ్లను నింపి గండ్లకు అడ్డుకట్ట కట్టారు. గత శనివారం బుడమేరుకు 10 చోట్ల గండి పడిన సంగతి తెలిసిందే. ఒక్కో గండి 10-15 మీటర్ల వెడల్పున పడింది. వరద తీవ్రతతో 4 రోజులు పనులు ముందుకు సాగలేదు.

#budameru
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe