Olympics : పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన వినేష్, అన్షు!

పారిస్ ఒలింపిక్స్ కు వినేశ్, అన్షు అర్హత! భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్ ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకుంది.

New Update
Olympics : పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన వినేష్, అన్షు!

Paris : భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్(Vinesh Phogat) ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొంది.. భారత కుస్తీ సమాఖ్య పెద్దల అనుచిత వైఖరికి నిరసనగా రోడ్డెక్కడంతో పాటు.. న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించిన వివాదాస్పద రెజ్లర్ వినేశ్ పోగట్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను ఖాయం చేసుకోడం ద్వారా విమర్శుకుల నోటికి తాళం వేసింది.

ప్రతికూల పరిస్థితిని అధిగమించి.. ఏడుగురు మహిళా వస్తాదుల పై లైంగిక వేధింపు(Sexual Harassment) లకు పాల్పడిన భారత కుస్తీ సమాఖ్య పెద్దలపై వినేశ్ పోగట్ తో సహా మొత్తం 30 మంది రెజ్లర్లు తిరుగుబాటు చేసి కొద్దిమాసాల పాటు కలకలం రేపారు. చివరకు న్యాయం కోసం ఢిల్లీ కోర్టులను సైతం ఆశ్రయించారు. కుస్తీ సమాఖ్య పై తమ పోరాటంతో కొద్దిమాసాలపాటు ఆటకు దూరమైన వినేశ్ ఒకదశలో పారిస్ ఒలింపిక్స్ కు సైతం దూరం కాకతప్పదని అందరూ భావించారు.

అయితే..శారీరక, మానసిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, కుస్తీ సమాఖ్య పెద్దలు నూటికి నూరుశాతం అండగా నిలువలేకపోయినా.. వినేశ్ మాత్రం ఒంటరిపోరాటమే చేసింది. కజకిస్థాన్ రాజధాని బిష్ కెక్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత ఆసియా కుస్తీ పోటీల మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్స్ చేరుకోడం ద్వారా పారిస్ టికెట్ ఖాయం చేసుకోగలిగింది. తొలిరౌండ్ నుంచి సెమీస్ వరకూ... కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల కుస్తీ పోటీలలో భారత్ కు గతంలోనే బంగారు పతకాలు సాధించి పెట్టిన వినేశ్ పోగట్ ఒలింపిక్స్ లోనూ భారత్ కు స్వర్ణపతకం సాధించి పెట్టాలన్న పట్టుదలతో ఉంది.

Also Read : డైటింగ్‌ మానేయండి..బార్లీ వాటర్‌ తాగండి..ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు