Asia cup: మరోసారి వర్షం గండం.. నేపాల్‌తో టీమిండియా ఢీ..బుమ్రా అవుట్!

ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ(సెప్టెంబర్ 4) భారత్‌, నేపాల్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ స్టార్ట్ అవ్వనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణలతో ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు సమాచారం. అతని స్థానంలో ఈ మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగనున్నాడు.

New Update
Asia cup: మరోసారి వర్షం గండం.. నేపాల్‌తో టీమిండియా ఢీ..బుమ్రా అవుట్!

India vs Nepal Asia Cup 2023: ఈ వర్షం ఏంటో అర్థంకాదు.. మరోసారి ఇండియా మ్యాచ్‌కే దర్శనమిచ్చేలా ఉంది. ఆసియా కప్‌(asia cup)లో భాగంగా ఇప్పటికే టీమిండియా ఆడిన ఒకే ఒక మ్యాచ్‌ రెయిన్‌ కారణంగా రద్దయింది. ఇవాళ పసికూన నేపాల్‌తో భారత్‌ తలపడనుండగా.. మరోసారి వర్షం(Rain) అడ్డంకిగా మారే సూచనలున్నాయిని వాతావరణశాఖ చెబుతోంది. శ్రీలంక(Srilanka) క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, నేపాల్(Nepal) మధ్య ఇవాళ జరగనున్న మ్యాచ్‌ సమయంలో 80శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక మ్యాచ్ వాష్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దవుతుందేమోనని క్రికెట్ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అలా జరగకూడదని కోరుకుంటున్నారు.

టాప్‌ అట్టర్‌ఫ్లాప్‌:
పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా టాప్‌-4 బ్యాటర్లు నిరాశ పరిచారు. పాక్‌ పేసర్ల దాటికి చేతులెత్తేశారు. రోహిత్‌,గిల్‌,కోహ్లీ,అయ్యర్‌ వికెట్లు పారేసుకున్నారు. వీరిలో రోహిత్, గిల్‌, కోహ్లీ క్లీన్‌ బౌల్డ్ అయ్యారు. రెండు బౌండరీలు బాది టచ్‌లోనే ఉన్నట్టు కనిపించిన రోహిత్‌ని షాహీన్‌ ఆఫ్రిది బౌల్డ్ చేయగా.. అదే ఊపులో కోహ్లీని కూడా పెవిలియన్‌ దారి పట్టించాడు. ఇక గిల్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. అసలు ఆడుతున్నది వన్డేనా టెస్టు మ్యాచానని అనుమానం వచ్చేలా సాగింది గిల్‌ ఆటతీరు. 32 బంతులు ఆడి 10 పరుగులే చేశాడు. అవి కూడా అతి కష్టం మీద చేశాడు. అసలు బాల్‌ని బ్యాట్‌ టచ్‌ చేయడానికే ఇబ్బంది పడ్డాడు. ఇక చాలా కాలం తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యర్‌ వరుససెట్టి రెండు బౌండరీలు బాదాడు.. రన్‌రేట్ పెంచే క్రమంలో దూకుడుగా ఆడాడు..కానీ 14రన్స్‌కే అవుట్ అయ్యాడు.

ఆ ఇద్దరిపైనే మరోసారి ఫోకస్‌:
ఇటివలి కాలంలో ఫామ్‌ పరంగా ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్‌ హార్దిక్‌ పాండ్యా. గత మ్యాచ్‌లో పాక్‌పై ప్రదర్శనతో విమర్శలకు చెక్‌ పెట్టాడు పాండ్యా. ఆపదలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలువైన ఆటగాడినోనని నిరూపించుకున్నాడు. అటు నంబర్‌-5 పొజిషన్‌లో ఫస్ట్ టైమ్‌ బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్‌కిషన్‌ దుమ్మురేపాడు.. 82 బంతుల్లో 81 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అటు ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా.. ఉన్నపళంగా ఇండియాకు బయలు దేరాడు. వ్యక్తిగత కారణలతోనే బుమ్రా ఇండియాకి తిరిగి వచ్చినట్టు సమాచారం. ఇక ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే అప్పుడు భారత్ సూపర్ 4కు చేరుకుంటుంది. ఎందుకంటే నేపాల్‌ ఇప్పటికే ఒక మ్యాచ్‌ ఓడిపోయి ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా):
1. రోహిత్ శర్మ (కెప్టెన్)

2. శుభమాన్ గిల్

3. విరాట్ కోహ్లీ

4. శ్రేయాస్ అయ్యర్

5. ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

6. హార్దిక్ పాండ్యా

7. రవీంద్ర జడేజా

8. శార్దూల్ ఠాకూర్

9. మహ్మద్ షమీ

10. కుల్దీప్ యాదవ్

11. మహ్మద్ సిరాజ్

ALSO READ: టీమిండియా వరల్డ్‌కప్ తుది జట్టు ఖరారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు