IND vs AUS: లెఫ్ట్‌ హ్యాండ్‌ సెహ్వాగ్‌ వచ్చాడు.. పక్కకు తప్పుకొండి తమ్ముళ్లూ!

ఆస్ట్రేలియాపై రెండో టీ20లో 25 బంతుల్లో 53 పరుగులు చేసిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని దూకుడు గతంలో సెహ్వాగ్‌ అటాకింగ్‌ గేమ్‌ను తలపిస్తుందని చెబుతున్నారు. టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడని సంబర పడుతున్నారు.

IND vs AUS: లెఫ్ట్‌ హ్యాండ్‌ సెహ్వాగ్‌ వచ్చాడు.. పక్కకు తప్పుకొండి తమ్ముళ్లూ!
New Update

Yashasvi Jaiswal: ఇండియాలో క్రికెట్‌ టాలెంట్‌కు అసలు కొదవలేదు. ఒకరు రిటైర్మెంట్‌ ఇస్తే వారి ప్లేస్‌లో మరొకరు ఫిల్‌ ఐపోతారు. కాస్త లేట్ అయినా ఫిల్ అవ్వడం మాత్రం పక్కా. టీమిండియాకు 14ఏళ్లు అద్భుత సేవలందించిన సెహ్వాగ్‌ను ఫ్యాన్స్‌ ఇప్పటికీ మరిచిపోలేదు. కెరీర్‌ ప్రారంభంలో సచిన్‌ శైలిని అనుకరించిన సెహ్వాగ్‌ ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక బ్యాటింగ్‌ స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. క్రికెట్‌లో సెహ్వాగ్‌ లాంటి ప్లేయర్‌ చాలా అరుదు. టెస్టుల్లోనూ వేగంగా సెంచరీలు, డబుల్ సెంచరీలే కాదు.. ఏకంగా రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌ సెహ్వాగ్‌. వన్డేల్లో తొలి బంతిని బౌండరీకి బాదడం సెహ్వాగ్‌(Virender Sehwag) స్పెషాలిటీ.. అలాంటి స్టైల్‌లోనే బ్యాటింగ్‌ చేసే ప్లేయర్‌ టీమిండియాకు దొరికేశాడంటున్నారు ఫ్యాన్స్!


యశస్వి జైస్వాల్.. నయా సంచలనం:
ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా అవతరించిన చిచ్చరపిడుగు యాశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal).. జాతీయ జట్టులోనూ సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియాపై తిరునంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో ప్రతాపం చూపించాడు. 25 బంతుల్లో 53 రన్స్ చేశాడు జైస్వాల్. ఇందులో 9ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గ్వైకాడ్‌ ఆచుతుచీ బ్యాటింగ్ చేయగా.. జైస్వాల్‌ మాత్రం వరుస బౌండరీలతో అలరించాడు. దీంతో భారత్‌కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. ఇప్పటివరకు టీమిండియాకు 10ఇన్నింగ్స్‌లు ఆడిన జైస్వాల్ 322 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.


అందుకే మరో సెహ్వాగ్ అంటున్నారు:
21ఏళ్ల యశస్వి వన్డేల్లో చోటు సంపాదించుకున్నా.. భవిష్యత్‌లో మాత్రం 50ఓవర్ల ఫార్మెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. ఎందుకంటే ప్రస్తుత ఓపెనర్‌గా ఉన్న రోహిత్‌ మరో రెండేళ్లు ఆడే ఛాన్స్ ఉంది. ఇక జైస్వాల్‌లో ఉన్న దూకుడు గతంలో సెహ్వాగ్‌లో కనిపించేదంటున్నారు ఫ్యాన్స్‌. ఆరంభం నుంచే ధాటిగా ఆడడం సెహ్వాగ్ నైజం. ఇటు జైస్వాల్‌ కూడా అదే ఆట తరహా ఆటతో రాణిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ ద్వారా జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. పవర్ ప్లే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు  చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Also Read: పోకిరిలో పండుగాడు.. క్రికెట్‌లో పాండ్యాగాడు.. ఇది యాపారం!

#cricket #india-vs-australia #yashasvi-jaiswal #virender-sehwag
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe