IND VS AUS: భారత్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు.. టార్గెట్ ఎంతంటే?

విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టీ20 ఫైట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 208 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్ సెంచరీతో కదం తొక్కాడు.

IND VS AUS: భారత్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు.. టార్గెట్ ఎంతంటే?
New Update

వరల్డ్‌కప్‌ ఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లు ఫేయిల్ అయ్యారు. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తియ్యలేక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ ధాటికి చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 50 బంతుల్లో 110 పరుగులు చేశాడు జోష్‌. అటు భారత్‌ బౌలర్లలో ముఖేశ్‌, అక్షర్‌ మినహా మిగిలిన ముగ్గురు బౌలర్లు ఘోరంగా పరుగులు సమర్పించుకున్నారు.

చిచ్చర పిడుగు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. స్టీవ్‌ స్మిత్ ఓపెనర్‌గా రావడం విశేషం. స్మిత్‌కు జోడిగా షార్ట్‌ దిగాడు. 31 పరుగులు స్కోరు వద్ద తొలి వికెట్ పడింది. రవిబిష్ణోయ్‌ బౌలింగ్‌లో షార్ట్ బౌల్డ్‌ అయ్యాడు. 11 బంతుల్లో 13 రన్స్ చేశాడు షార్ట్. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జోష్‌ ఇంగ్లిస్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్సర్లతో ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోష్‌ ఆ తర్వాత మరింత వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. వరుస పెట్టి ఫోర్లు కొట్టాడు. మరోవైపు హాఫ్‌ సెంచరీ చేసిన స్మిత్‌ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రనౌట్ అయ్యాడు. 41 బంతుల్లో 52 రన్స్ చేసిన స్మిత్ ఖాతాలో 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరు 130 పరుగుల పార్ట్‌నెర్‌షిప్‌ను నెలకోల్పారు.

అటు మరో ఎండ్‌లో భారత్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న జోష్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు జోష్‌. ఆ తర్వాత ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో యశశ్వికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తంగా 50 బంతుల్లో 110 పరుగులు చేశాడు జోష్‌. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

జోష్‌ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చి స్టోయినిస్‌, టిమ్‌ డెవిడ్‌ కలిసి జట్టు స్కోరును 200 దాటేలా చేశారు. ఇక భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లలో రవి 54 రన్స్ సమర్పించుకుంటే.. అటు ప్రసిద్ద్‌ నాలుగు ఓవర్ల కోటాలో 50 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఆరో బౌలర్‌ లేకుండానే బరిలోకి దిగింది.

Also Read: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్‌ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..!

WATCH:

#cricket #vizag #india-vs-australia #josh-inglis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe