Border–Gavaskar Trophy: ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న భారత్ మరో వలర్డ్ కప్ ను ఒడిసిపట్టేందుకు రంగం సిద్ధమైంది. రెండుసార్లు అందినట్లే అంది మిస్ అయిపోయిన టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాలతో ప్రతిష్టాత్మక సిరీస్ ఆడనుంది. ఈ మేరకు 2023-25 (WTC) సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.
అయితే ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చేందుకు భారత (Team India) అభిమానులు ఆసక్తి చూపిస్తారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాం. అందులో భాగంగా ఫ్యాన్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచ్‌లను ఆస్వాదించడంతోపాటు సంబరాలు చేసుకునే వీలుగా ఈ వేదికలు ఉంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా జనరల్ మేనేజర్ జోయల్ మోరిసన్ తెలిపారు.
షెడ్యూల్:
తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్)
రెండో టెస్టు: డిసెంబర్ 06-10 (అడిలైడ్)
మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (బ్రిస్బేన్)
నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26-30 (మెల్‌బోర్న్)
ఐదో టెస్టు: జనవరి 03-07 (సిడ్నీ)
గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిన టీమ్ఇండియా రివేంజ్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి ఇకపై టెస్టులపైనే పెట్టనున్నారు. డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని రోహిత్ ఉవ్విల్లూరుతున్నాడు.