IND VS AUS: మ్యాచ్‌ సమయంలో వర్షం కురుస్తుందా? రెండో టీ20కి ముందు వరుణుడి టెన్షన్!

కేరళ-తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్‌ సమయలో వర్షం కురిసే అవకాశం ఉంది. 55శాతం రెయిన్‌ పడే ఛాన్స్ ఉందని సమాచారం.

New Update
IND VS AUS: మ్యాచ్‌ సమయంలో వర్షం కురుస్తుందా? రెండో టీ20కి ముందు వరుణుడి టెన్షన్!

ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి లీడింగ్‌లో ఉంది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో సూర్య టీమ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌ విశాఖలో జరగగా.. భారత్‌ రెండు వికెట్లతో విజయం సాధించింది. ఇవాళ(నవంబర్ 26) మ్యాచ్‌ తిరువనంతపురం(Thiruvananthapuram)లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని సమాచారం.


55శాతం వర్షం కురిసే అవకాశం:
అక్యూవెదర్(Accuweather) ప్రకారం మ్యాచ్‌ సమయలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది స్టాప్-స్టార్ట్ కాంటెస్ట్ కావచ్చు. ఇవాళ వర్షం పడే అవకాశం 55శాతం ఉంది. మేఘాల ఆవరణం 25శాతం ఉంటుంది. రాత్రి సమయంలో, వర్షం పడే అవకాశం 11శాతానికి తగ్గుతుంది. మేఘాల ఆవరణం 16శాతానికి ఉంటుంది. అంటే మ్యాచ్‌ పూర్తిగా వాష్‌అవుట్ అయ్యే ఛాన్స్ లేకపోయినా కచ్చితంగా ఏది చెప్పలేని పరిస్థితి. ఇక మ్యాచ్‌ సమయంలో రెయిన్ కురిసి అవుట్‌ఫీల్డ్ పరిస్థితులు తడిగా ఉంటే మ్యాచ్‌ను రద్దు చేసే ఛాన్స్ ఉంటుంది.

అదే జట్టులో టీమిండియా:
ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా రెండు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20ల్లో ఎప్పటిలాగే తన సత్తా నిరూపించుకున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. 209 పరుగుల టార్గెట్‌లో రెండు వికెట్ల పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యాభాయ్‌ 42 బంతుల్లోనే 80 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇక చివరిలో రింకూ సింగ్‌ మెరుపులు మెరిపించాడు. చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. 14 బంతుల్లో 22 రన్స్ చేశాడు రింకూ.

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా):

ట్రావిస్ హెడ్/మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, మాథ్యూ వేడ్ (c/wk), సీన్ అబాట్, నాథన్ ఎలిజం జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా/తన్వీర్ సంఘా

టీమిండియా తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Also Read: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!

WATCH:

Advertisment
తాజా కథనాలు