Swadeshi Kamikaze Drones: కొత్త ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటోంది ఇండియా. యుద్ధరంగంలో ఉపయోగించే కామికేజ్ డ్రోన్లను తయారు చేసింది. ఆత్మాహుతి డ్రోన్ల కింద వీటిని వాడతారు. భారత్‌లోని నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ వీటిని తయారు చేస్తోంది. ఇవి మానవ రహిత విమానాలు. శత్రువులను మట్టుబెట్టడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మానవ రహిత విమానాలు 1000 కి.మీ పరిధి వరకు ప్రయాణించి మరీ శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 120 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు.
ఈ కామికేజ్ డ్రోన్లను ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడారు. రష్యా మీద ఉక్రెయిన్ వీటిని ప్రయోగించింది. రిమోట్ కంట్రోల్‌తో వీటిని నియంత్రించవచ్చును. ఒకేసారి ఎక్కువ డ్రోన్లను కూడా ఉపయోగించవచ్చు. నిజానికి ఈ కామికేజ్ డ్రోన్ల వరల్డ్ వార్–2 లోనే వాడారు. జపాన్ వైమానికదళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు వారి యుద్ధవిమానాలను అమెరికా దాని మిత్రరాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లుగా దాడులకు పాల్పడ్డాయి.
భారత వైమానిక దళం దగ్గర కూడా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. భారత కామికేజ్ డ్రోన్లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రెక్కలు కలిగి ఉంటాయి. ఇవి ఆకాశంలోకి వెళ్తే 9 గంటల వరకు ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో పాటు వీటిని క్రాష్ చేసి దాడులు చేయవచ్చు. ఇండియన్ కామికేజ్ డ్రోన్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ రూపొందించిన 30-హార్స్ పవర్ ఇంజన్లను ఈ డ్రోన్లలో ఉపయోగిస్తున్నారు.
Also Read: Bangladesh: నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు..మౌనం వీడిన షేక్ హసీనా