Bangladesh: బంగ్లాదేశ్ కు రైలు సర్వీసులు రద్దు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను కొంతకాలం పాటు సస్పెండ్‌ చేసినట్లు భారతీయ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్
New Update

Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను కొంతకాలం పాటు సస్పెండ్‌ చేసినట్లు భారతీయ రైల్వేస్‌ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతోపాటు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, పాలనా పగ్గాలను సైన్యానికి అప్పగించడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

తొలుత గుర్తు తెలియని ప్రదేశానికి షేక్ హసీనా తరలి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు వెళ్లే విమాన సర్వీసులను కూడా భారతీయ రైల్వే నిలిపివేసింది.

బంగ్లాదేశ్ పరిస్థితులు అస్సలు ఏమీ బాగాలేవు. ఆందోళనలతో అట్టుడుకుతోంది. అల్లర్లు చేలరేగాయి. అల్లరి మూకలు ఆ దేశ ప్రధాని ఇంటిపై కూడా దాడికి తెగబడ్డాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా…కుటం సభ్యుల ఒత్తిడి మేరకు ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా..దేశం విడిచి కూడా వెళ్ళిపోయారు. 15 ఏళ్ళపాటూ అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నారని..కానీ ఇప్పుడు ఇంక ఆమెకు ఓపిక లేదని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ చెప్పారు. తాజా పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశపరిచాయని తెలిపారు. అందుకే ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని వివరించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న షెక్ హసీనా ఇక్కడ నుంచి లండన్ వెళ్ళనున్నారు.

Also read: గద్దర్‌ గళం మూగబోయి నేటికి ఏడాది..!

#bangladesh #suspended #indain-railways
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe