భారత్ నుంచి శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ వర్చువల్ గా పాల్గొన్నారు. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కనకేసంతురాయ్ మధ్య ఈ ఫెర్రీ రాకపోకలు జరపనుంది.
ఈ ఫెర్రీ సర్వీసుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. దీని వల్ల భారత్ శ్రీలంక సంబంధాలు మరింత దగ్గర కానున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యాపార, పర్యాటక సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.
Also read: జైల్లో చంద్రబాబుకు ఆ ఆరోగ్య సమస్య.. వైద్యుల షాకింగ్ ప్రకటన.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్..
నాగపట్నం నుంచి కనకేసంతురాయ్ మధ్య ఫెర్రీ సర్వీసు మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు. ఈ సర్వీసుల గురించి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే మాట్లాడుతూ..ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పెంచడంలో ఇది మరో అడుగు అని ఆయన తెలిపారు. కొంత కాలం క్రితం దేశంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఫెర్రీ సర్వీసులను ఆపి మళ్లీ పునః ప్రారంభించమన్నారు.
సుమారు 40 సంవత్సరాల ముందు వరకు ఇరు ప్రాంతాలకు ఫెర్రీలు నడిచేవి.కానీ ఎల్టీటీఈతో యుద్ధం వల్ల వాటిని నిలుపుదల చేశారు. ఫెర్రీ వల్ల కేవలం 3 గంటల్లోనే శ్రీలంకకు చేరుకోవచ్చు. దీని టికెట్ ను అన్నింటిని కలుపుకొని రూ. 7670 గా అధికారులు నిర్ణయించారు.
ప్రారంభం సందర్భంగా శనివారం నాడు మాత్రమే రూ. 2800 వసూలు చేస్తున్నారు.