Jobs: టెన్త్ అర్హతతో 30,000 పోస్టులు..ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

30వేలకు పైగా పోస్టులకు సంబంధించి ఇండియా పోస్ట్ (GDS) గతంలో విడుదల చేసిన దరఖాస్తుల ప్రక్రియకు టైమ్‌ ముగియనుంది. ఆగస్టు 23తో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ క్లోజ్‌ అవుతుంది. టెన్త్ అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

New Update
Jobs: టెన్త్ అర్హతతో 30,000 పోస్టులు..ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

India Post GDS Recruitment 2023 : ఇండియా పోస్ట్ గతంలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీ చేస్తుండగా.. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆఖరి తేది ఈ నెల 23.

ఖాళీల వివరాలు : 

• మొత్తం పోస్టులు: 30,041

‣ కేటగిరీ వారీగా పోస్ట్‌లు:

‣ జనరల్: 13,618

‣ ఈడబ్యూఎస్‌(EWS): 2,847
‣ ఓబీసీ(OBC): 6,051
‣ ఎస్సీ: 4,138
‣ ఎస్టీ(ST): 2,669
‣ PWDC: 223
‣ PWBD: 220
‣ PWDA: 195
‣ PWDDE: 70

⦿ క్వాలిఫికేషన్ :
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి కచ్చితంగా స్కూల్‌ లెవల్‌లో స్థానిక భాషను ఓ సబ్జెట్‌గా చదివి ఉండాలి. కనీసం సెకండరీ స్టాండర్డ్‌ వరకు చదవి ఉన్నా చాలు.

ఎలా దరఖాస్తు చేయాలి:

⦿ స్టెప్ 1: click here to apply ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

⦿ స్టెప్ 2: హోమ్‌పేజీలో, 'GDS రిక్రూట్‌మెంట్ 2023'(GDS recruitment 2023) లింక్‌పై క్లిక్ చేయండి.

⦿ స్టెప్ 3: కంటీన్యూ చేసే ముందు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌తో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను చూడండి.

⦿ స్టెప్ 4: దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి 'సబ్మిట్‌ ఆన్‌లైన్‌'పై క్లిక్ చేయండి.

⦿ స్టెప్ 5: అవసరమైన సమాచారంతో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. కావాల్సిన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి.

⦿ స్టెప్ 6: దరఖాస్తు రుసుమును చెల్లించండి.. ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

➼ వయసు:
అభ్యర్థులు 18-40ఏళ్ల మధ్యలో ఉండాలి.

➼ ఫీజ్‌:
జనరల్‌ కేటగిరి: రూ.100/-

SC/ST/PWD: నో ఫీజ్‌

➼ జీతం:
BPM: రూ.12,000 నుంచి 29,380/-
ABPM/డాక్ సేవక్: రూ.10,000/- నుంచి 24,470/-

#india-post-gds-recruitment-2023 #india-post-gds-recruitment #india-post-gds-recruitment-2023-apply-online #jobs
Advertisment
తాజా కథనాలు