Jobs: టెన్త్ అర్హతతో 30వేల ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! పదో తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్‌కి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించి అప్లికేషన్ గడువు రేపటి(ఆగస్టు 23)తో ముగియనుంది. మొత్తం 30,041 ఖాళీలున్నాయి. పోస్టులను బట్టి రూ.10,000 నుంచి రూ.29,380 వరకు శాలరీ ఉంటుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు, మ్యాథ్స్ కోర్ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి. By Trinath 22 Aug 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్స్ (GDS), అసిస్టెంట్ బ్రాండ్ పోస్ట్ మాస్టర్ (ABPM), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలవగా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపే(ఆగస్టు 23) లాస్ట్ డేట్. దరఖాస్తుదారులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను (click here for official website) విజిట్ చేయండి. ➼ ముఖ్యమైన తేదీలు: ‣ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- ఆగస్టు 3న ‣ దరఖాస్తుకు చివరి తేదీ- ఆగస్టు 23 ‣ కరెక్షన్ విండో: ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు ‣ పరీక్ష తేదీ: ఇంకా ప్రకటించాల్సి ఉంది ➼ ఏ ఏ పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి? ⁍ గ్రామీణ డాక్ సేవకులు ⁍ బ్రాంచ్ పోస్ట్ ⁍ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలు: 30,041 ➼ దరఖాస్తు రుసుము: జనరల్ క్యాటగిరి: రూ. 100. ➼ ఫీజ్: SC/ST/మహిళలు/PwD-N/Aతో సహా ఇతర దరఖాస్తుదారులకు ఎలాంటి ఫీజ్ లేదు ➼ విద్యా అర్హత: దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు, మ్యాథ్స్ కోర్ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి. ➼ వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు, విధానాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ➼ ఎంపిక ప్రక్రియ: 10వ తరగతిలో దరఖాస్తుదారు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ➼ జీతం: పోస్టులను బట్టి రూ.10,000 నుంచి రూ.29,380 వరకు శాలరీ ఉంటుంది. ➼ దరఖాస్తు ప్రక్రియ: ➊ indiapostgdsonline.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. ➋ ఎంగేజ్‌మెంట్ పోర్టల్ కోసం నమోదు చేసుకోండి. ➌ రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించండి. ➍ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి. ➎ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి. ➏ భవిష్యత్ ప్రయోజనాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి. అదనపు సమాచారం: 🅐 అధికారుల నుంచి సమాచారాన్ని స్వీకరించడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ప్రస్తుతం యూజ్ చేస్తున్న ఈమెయిల్ ID, మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి. 🅑 సెలక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అన్ని అవసరమైన డాక్యుమెంట్లతో తప్పనిసరిగా హాజరు కావాలి. BULLET SIGNS CREDIT/ fsymbols #jobs #india-post-gds-recruitment #india-post-gds-recruitment-2023-apply-online #india-post-office-gds-recruitment-2023 #postal-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి