'INDIA' Meet: టార్గెట్‌ అదానీ..! మోదీతో ఆయనకు లింకేంటి: రాహుల్ సూటి ప్రశ్న

మోదీకి అదానీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. పారిశ్రామికవేత్త అదానీ ఓ తీవ్ర విమర్శలు చేశారు.. I.N.D.I.A కూటమి సమావేశానికి ముందు రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి అదానీ గ్రూప్‌పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

'INDIA' Meet: టార్గెట్‌ అదానీ..! మోదీతో ఆయనకు లింకేంటి: రాహుల్ సూటి ప్రశ్న
New Update

Rahul on Adani issue: ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీ టార్గెట్‌గా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ముంబైలో జరిగిన 'I.N.D.I.A' కూటమి మీటింగ్‌కి వచ్చిన రాహుల్‌ ఈ ఇద్దరిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అదానీ గ్రూప్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై వచ్చిన ఆరోపణులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు రాహుల్. తాజా స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణల తర్వాత రాహుల్ గాంధీ అదానీని టార్గెట్ చేశారు.


రాహుల్‌ ఏం అన్నారంటే?
➼ అదానీ అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రధాని మోదీ భయపడుతున్నారు.

➼ అదానీ విషయాన్ని లేవనెత్తినప్పుడల్లా మోదీ చాలా అసౌకర్యానికి గురవుతారు.

➼ మోదీకి అదానీకి సంబంధం ఏంటి?

➼ అదానీ విషయంలో ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు?

➼ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి అదానీ గ్రూప్‌పై సమగ్ర విచారణ జరిపించాలి

➼ ఇది ఎవరి డబ్బు? అది అదానీదా లేక మరొకరిదా?

➼ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ అనే వ్యక్తి దీని వెనుక సూత్రధారి.

➼ ఈ డబ్బుల దందాలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

➼ ఒకరు నాసిర్ అలీ షాబాన్ అహ్లీ అనే పెద్దమనిషి, మరొకరు చాంగ్ చుంగ్ లింగ్ అనే చైనీస్ పెద్దమనిషి.

➼ దాదాపు అన్ని భారతీయ మౌలిక సదుపాయాలను నియంత్రించే కంపెనీలలో ఒకదాని వాల్యుయేషన్‌తో ఆడుకోవడానికి ఈ ఇద్దరు విదేశీ పౌరులను ఎందుకు అనుమతించారు?

➼  పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్లు ధరలు కృత్రిమంగా పెంచారు

➼  షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు

➼  అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారు


టార్గెట్ అదానీ:
అదానీ గ్రూప్ తన సొంత షేర్లలో రహస్యంగా పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ అతను 'ది గార్డియన్'(The guardian) వార్తా నివేదికను చూపించారు రాహుల్ . ఈ నివేదిక అదానీ గ్రూప్‌ను "మోదీ-లింక్డ్(modi linked)" అని పేర్కొంది. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ రాహుల్‌ నిప్పులు చెరిగారు. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛెంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబీ(SEBI) అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో తన దర్యాప్తు స్థితిని సుప్రీంకోర్టుకు సమర్పించింది. అదానీ గ్రూప్ కంపెనీల షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించిన కేసులో భారతీయ ప్రైవేట్ బ్యాంక్, మరో 15 సంస్థల లింక్‌లను ఈడీ(ED) దర్యాప్తు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ(ED) దర్యాప్తును నమోదు చేయలేనప్పటికీ, ఒక ముందస్తు నేరం జరిగే వరకు సెబీ ఇన్‌వాల్వ్‌ అవొచ్చు. న్యాయమైన చట్టాన్ని అణగదొక్కే అవకాశం ఉన్న ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలలో పాల్గొన్న సంస్థపై క్రిమినల్ దర్యాప్తును నమోదు చేసే అధికారం సెబికి ఉంది. ఇక గతంలో అమెరికాకు చెందిన హిండన్‌బర్డ్‌ అదానీ కంపెనీలో అవకతవకలపై విడుదల చేసిన నివేదిక కేవలం ఇండియా వ్యాప్తంగానే కాకుండా అదానీ కంపెనీలున్న దేశాల్లోనూ ప్రకంపనలు రేపింది.

ALSO READ: అక్టోబర్‌లో లోక్‌సభ రద్దు? ముందస్తు ఎన్నికలు ఫిక్స్..?

#adani-group #india-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe