Russia Oil: ఈ సంవత్సరం మొదటి 9 నెలల్లో, రష్యా నుంచి తక్కువ ధరలకు క్రూడాయిల్ ను కొనుగోలు చేయడం ద్వారా భారతీయ కంపెనీలు సుమారు ₹22,490 కోట్లు ఆదా చేశాయి. ఈ కాలంలో రష్యా నుంచి భారత్ 69.1 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. జనవరి - సెప్టెంబర్ మధ్య, భారతదేశం రష్యా నుంచి చమురును టన్నుకు ₹ 43,782 చొప్పున కొనుగోలు చేసింది (ఇందులో షిప్పింగ్ - ఇతర ఛార్జీలు ఉన్నాయి).
ఈ సమయంలో,, ఇరాక్ ఇతర దేశాలలో ముడి చమురు టన్ను ₹ 47,019 ధర ఉండేది. దీని ప్రకారం, కంపెనీలు టన్నుకు దాదాపు ₹ 3200 చౌకగా చమురును కొనుగోలు చేశాయి. ప్రభుత్వ గణాంకాల ఆధారంగా రాయిటర్స్ ఈ సమాచారం ఇచ్చింది.
Also Read: Air Taxi: గాల్లో రయ్.. రయ్యంటూ గమ్యస్థానానికి.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది
రష్యాపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు
ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారతదేశం దీనిని సద్వినియోగం చేసుకొని యూరప్‌కు బదులుగా రష్యా నుంచి చమురు(Russia Oil) దిగుమతిని పెంచింది.
3 సంవత్సరాలలో రష్యా నుంచి పెరిగిన దిగుమతులు:
2020లో రష్యా నుంచి భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 2% మాత్రమే కొనుగోలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు 2021లో మొత్తం సరఫరా 16%కి - 2022లో 35%కి పెరిగింది. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో 40% రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.
భారతదేశ మొత్తం వాణిజ్య విలువలో ముడి చమురు వాటా మూడో వంతు. అంటే, భారతదేశం బయట నుంచి దిగుమతి చేసుకున్నది దాదాపు మూడింట ఒక వంతు ముడి చమురు. అందువల్ల ఈ లాభం వాణిజ్య లోటును తగ్గిస్తుంది.
Watch this interesting video: