Air Taxi India: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!

Air Taxi India: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!
New Update

ట్రాఫిక్‌లో వెళ్లాలంటే చికాకు పుడుతుంది. చాలా టైమ్‌ వేస్ట్ అవుతుంది. గమ్యస్థానం తక్కువ దూరంలోనే ఉన్నా వెళ్లలేనంత దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. పైగా రోడ్డుపై వెళ్లే వాహనాల నుంచి వచ్చే పొగ, దుమ్ము.. బాబోయ్‌ పొలూష్యన్‌ అంతా ముక్కులోకే పోతుంది. కొన్నిసార్లు ట్రాఫిక్‌లో బైక్‌ అలా ఆపి ఉంచితే.. ముందున్న బస్‌ లేదా లారీ నుంచి ఒక్కసారిగా పొగ బయటకు వస్తుంది.. కాసేపు ఆ పొగను చూస్తే WWEలో అండర్‌టేకర్‌(Under Taker) వస్తున్నాడానన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అంతకంటే ఘోరంగా ఆ పొగంతా మన బాడీలోకి వెళ్తుంది. అటు ఆఫీస్‌ టైమ్‌ ముంచుకొస్తుంటుంది. అప్పుడే అనిపిస్తుంది.. ఇలా రోడ్డుపై కాదు.. గాల్లో ఎగురుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందోనని. మీక్కూడా ఇలానే అనిపించిందా? అయితే మీ ఊహలు నిజమయ్యే రోజు త్వరలోనే ఉంది. ఎందుకుంటే ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్..! అవి కూడా ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీలు బాసూ..! వింటుంటేనే థ్రిల్ల్‌గా అనిపిస్తుందా.. అయితే మొత్తం డీటెయిల్స్‌ తెలుసుకోండి.

అసలేంటీ ఎయిర్ ట్యాక్సీ కథ?
ఎయిర్‌ ట్యాక్సీ(Air Taxi) ఆలోచన కొత్తది కాదు.. చాలా కాలం నుంచి వింటున్నదే. అయితే ఇప్పుడీ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ దిగ్గజం ఆర్చర్ ఏవియేషన్ ఢిల్లీ(Delhi)లో భేటీ అయ్యాయి. మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీలను పరిచయం చేయడానికి చేతులు కలిపాయి. 2026 నాటికి ఈ ఎయిర్‌ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 200 ఆర్చర్స్ మిడ్‌నైట్ విమానాలను అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఎంత సమయం తగ్గుతుంది?
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గుర్గావ్ మధ్య 27 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితులను బట్టి దాదాపు కన్నాట్‌ ప్లేస్ నుంచి గుర్గావ్‌ వెళ్లడానికి 60 నుంచి 90 నిమిషాలు పడుతుంది. ఈ ఎయిర్ టాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయాన్ని కేవలం 7 నిమిషాలకు తగ్గించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వాడకంతో పొలూష్యన్‌కు చెక్‌ పడుతుంది.

ట్యాక్సీలు ఎలా ఉంటాయి?
మిడ్‌నైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం నాలుగు సీట్లు ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్‌ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది పర్యావరణ అనుకూలమైనది.. అంటే తక్కువ శబ్దం చేస్తుంది. ఇక వేగవంతమైన ఛార్జింగ్ కూడా దీని బెస్ట్ ఫీచర్లలో ఒకటి. టాక్సీ సేవలతో పాటు, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సర్వీసెస్, కార్గో ట్రాన్స్‌పోర్ట్, అలాగే చార్టర్ సర్వీసెస్‌ కూడా ఈ ట్యాక్సీలతో అందుబాటులోకి రానున్నాయి. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రయాణించగలదు.

Also Read: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

WATCH:

#air-taxi #delhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి