Olympics 2024 : భారత హాకీ జట్టుకు షాక్.. బెల్జియం చేతిలో ఇండియా ఓటమి

పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టుకు షాక్ తగిలింది. హాఫ్ టైమ్ వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, చివర్లో 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి హాఫ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఆ తర్వాత బెల్జియం జట్టు వరుసగా రెండు గోల్స్ చేసి భారత్‌ ను ఓడించింది.

New Update
Olympics 2024 : భారత హాకీ జట్టుకు షాక్.. బెల్జియం చేతిలో ఇండియా ఓటమి

Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టుకు షాకింగ్ ఓటమి ఎదురైంది. హాఫ్ టైమ్ వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, తర్వాత రెండు గోల్స్ తిని 2-1తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి హాఫ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యర్థిని ఆధిక్యంలో ఉంచింది. అయితే, సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే బెల్జియం జట్టు తిరుగుబాటు చేసింది. వరుసగా రెండు గోల్స్ చేసి భారత్‌ను షాక్‌కు గురిచేసింది.

Also Read : భారత్‌కు మూడో మెడల్‌.. షూటింగ్‌లో రఫ్పాడించిన స్వప్నిల్!

ఈ మ్యాచ్ లో భార‌త్ త‌ర‌పున అభిషేక్ ఒక్క‌డే గోల్ చేశాడు. తొలి రెండు క్వార్ట‌ర్ల‌లో భార‌త్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కీల‌క‌మైన చివ‌రి రెండు క్వార్ట‌ర్స్‌లో బెల్జియం ఆట‌గాళ్లు జోరు పెంచారు. రాజ్ కుమార్ పాల్‌కు ఎల్లో కార్డు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. చివ‌రి నిమిషాల్లో ఒక ఆట‌గాడు లేకుండానే ఇండియా ఆడాల్సి వ‌చ్చింది. ఈ ఓటమితో భారత హాకీ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అయితే, ఇంకా టోర్నమెంట్ ముగియలేదు. భారత్ తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు