CM Kejriwal: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష సీఎంలు అరెస్ట్ అవుతారు.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిపక్ష సీఎంలను జైలుకు పంపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేజ్రీవాల్. అమిత్ షాను ప్రధాని చేసేందుకు రెండు నెలల తరువాత యూపీలో యోగిని సీఎం పదవిలో నుంచి తప్పించాలనే కుట్ర జరుగుతోందని అన్నారు.

CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
New Update

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి 'ఒకే దేశం ఒక నాయకుడు' అనే చాలా ప్రమాదకరమైన మిషన్ ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, పినరయి విజయన్, ఉద్ధవ్ థాకరే తదితర ప్రతిపక్ష నేతలు జైల్లో ఉంటారని పేర్కొన్నారు.

2 నెలల్లో యోగిని సీఎం పదవి నుంచి తప్పిస్తున్నారు..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే 2 నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీలో అద్వానీ, మురళీ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్‌ల రాజకీయాలు ముగిశాయని పేర్కొన్నారు. వాళ్ళ పార్టీలోనే ముఖ్యమైన నేతల రాజకీయ జేవితాన్ని అంతం చేయాలనే కుట్రలో బీజేపీ ఉందని ఆరోపించారు. ఇప్పుడు తరువాతి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని.. మోదీ గెలిస్తే రెండు నెలల్లో యూపీ సీఎంను మారుస్తారని కేజ్రీవాల్ అన్నారు.

అమిత్ షానే ప్రధాని... 

ఈ సారి బీజేపీకి మరోసారి అధికారం ఇస్తే ప్రస్తుత కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ప్రధాని అవుతారని అన్నారు కేజ్రీవాల్. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏళ్లు నిండుతాయని.. ఒక సంవత్సరం తరువాత మోదీని ప్రధాని పదవిలో నుంచి తీసేసి అమిత్ షా ను ప్రధానిని చేయనున్నారని వ్యాఖ్యానించారు.

గెలిచేది ఇండియా కూటమే.. 

మోదీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని అణిచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయనకు ఒక దేశం, ఒకే నాయకుడు అనే ప్రమాదకరమైన మిషన్ ఉందని ఆరోపించారు. జూన్ 4న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అందులో ఆప్ ప్రభుత్వంలో భాగం అవుతుందని అన్నారు.

కుట్ర చేసి నన్ను జైలుకు పంపారు..

“అరెస్ట్ అయినప్పుడు నేను ఎందుకు రాజీనామా చేయలేదు? ఢిల్లీలో ఆప్ అపూర్వ మెజార్టీతో గెలిచింది. రాబోయే 20 ఏళ్లు కూడా మమ్మల్ని ఓడించలేమని వారికి (బీజేపీ) తెలుసు. నేను రాజీనామా చేస్తానని, ఆప్ ప్రభుత్వం పడిపోతుందని వారు కుట్ర పన్నారు. నేను రాజీనామా చేయను, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాను.. హేమంత్ సోరెన్ కూడా రాజీనామా చేసి ఉండాల్సింది కాదు’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

మోదీ ప్రధాని కాలేరు..

'జూన్ 4న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని నా అంచనా.. బీజేపీకి 220-230 సీట్లు వస్తాయని అనుకుంటున్న.. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ ప్రభుత్వంలో ఆప్ భాగస్వామ్యమవుతుంది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తాం.. ఢిల్లీకి పీపుల్స్ గవర్నర్ ఉంటారు, గుజరాత్‌కు చెందిన వ్యక్తి కాదు' అని కేజ్రీవాల్ అన్నారు.

#cm-kejriwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe